Thug Life on OTT: డెడ్‌లైన్ కంటే ముందే ఓటీటీలోకి థగ్ లైఫ్.. ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. దాదాపు 35 ఏళ్ల తర్వాత మణిరత్నంతో కలిసి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అభిమానులు, సినీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక చతికిలపడింది. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వస్తున్నదనే ప్రచారం సోషల్ మీడియాలోను, జాతీయ మీడియాలోను ఊపందుకొన్నది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. జూన్ 5వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

అయితే థగ్ లైఫ్ గానీ, ఇతర సినిమాల ఓటీటీ రిలీజ్‌కు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఓటీటీ సంస్థల డిమాండ్ మేరకు సినిమాల రిలీజ్ డేట్స్ మారడానికి ఆస్కారం ఉంటుంది. అయితే సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్రమాణాన్ని, నిబంధనలను కొన్ని సినీ పరిశ్రమలు పాటిస్తున్నాయి. అయితే వాటికి అనుగుణంగానే థగ్ లైఫ్ సినిమాను 8 వారాల వ్యవధి తర్వాత ఓటీటీలోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్, ఓటీటీ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.
అయితే సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఘనంగా వసూళ్లు సాధిస్తే ఇలాంటి 8 వారాల ఒప్పందాలకు ఢోకా ఉండదు. కానీ రిజల్ట్ తేడా కొడితే రిలీజ్ డేట్స్ మార్పులు అనివార్యంగా మారడం సహజంగా కనిపిస్తున్నాయి. అయితే థగ్ లైఫ్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గడ్డు పరిస్థితి ఏర్పడినందున ఈ సినిమాను ముందే ఓటీటీలోకి తీసుకు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన తెరపైకి వచ్చింది.
అయితే థగ్ లైఫ్‌ను 8 వారాల తర్వాత కాకుండా ముందే రిలీజ్ చేయాలని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒత్తిడి తెస్తున్నది. కాబట్టి ఈ సినిమాను 4 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని సూచించింది. ఓటీటీ సంస్థకు, చిత్ర యూనిట్‌కు మధ్య ఆ చర్చలు వర్కవుట్ అయితే 4 వారాలకే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చు అనే టాక్ బలంగా వినిపిస్తున్నది.
కర్ణాటకలో నిషేధం లాంటి వ్యవహారం కోర్టులో ఓ పక్క కొనసాగుతుండటం, అలాగే తమిళనాడులో ఈ సినిమా కొంతలో కొంత బెటర్‌గా వసూళ్లు సాధించడం కనిపిస్తున్నది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. తమిళనాడులో 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ కొన్ని రోజుల్లో థియేట్రికల్ రన్ పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా డెడ్‌లైన్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











