OTT: తెలుగులో వస్తున్న వరల్డ్ నెం 1 సిరీస్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
ప్రస్తుతం ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పోటాపోటీగా విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు తెరకెక్కించి సినీ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ, ఓటీటీలు ఏమాత్రం లేని సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ టీవీ సిరీస్ గా పేరు తెచ్చుకుంది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (Game Of Thrones). 2011లో ప్రారంభమైన ఈ సిరీస్ వరల్డ్ వైడ్ గా ప్రఖ్యాతి గాంచింది. దర్శక దిగ్గజం రాజమౌళి వంటి ఎంతోమంది ప్రముఖులకు ఫేవరేట్ గా నిల్చిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తెలుగులో రానుంది.
రాజు మరణిస్తే: గేమ్ ఆఫ్ థ్రోన్స్ .. ఇట్స్ నాట్ ఏ సిరీస్.. ఇట్స్ ఆన్ ఎమోషన్. అవును, మూవీ లవర్స్ కు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓ ఎమోషన్. ఎందుకంటే, అంతలా ఆ టీవీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే చేసే అంత్యక్రియలు, కర్మ వంటి అంశాలతో బలగం సినిమాను చూశాం. అలాగే ఒక రాజ్యాన్ని ఏలుతున్న రాజు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే.. ఆ కుటుంబం ఎలా చెల్లాచెదురైంది? ఒక్కొక్కరుగా ఎక్కడికి పారిపోవాల్సి వచ్చింది? ఎలాంటి సమస్యలు, సంఘటనలు ఎదుర్కున్నారు? ఆ రాజ్యాన్ని చేజిక్కుంచుకునేందుకు ఇతర దేశాలు ఏం చేశాయి? వంటి అంశాలతో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంటుంది.

నటీనటులు: గేఫ్ ఆఫ్ థ్రోన్స్ (GOT) సిరీసులో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానే కాకుండా ఊహించని ఫాంటసీ, గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్స్, అడల్డ్ కంటెంట్, మోసం, డైలాగ్స్ వంటి ప్రతి ఒక్క విషయాన్ని అద్భుతంగా ప్రజంట్ చేశారు. ఇందులో కిట్ హరింగ్టన్, ఎమిలా క్లార్క్, సోఫీ టర్నర్, మైసీ విలియమ్స్, లీనా హెడీ, పీటర్ డింక్లేజ్, సీన్ బీన్ తదితరులు తమ నటనతో అలరించారు.

ఊపిరి బిగపట్టేలా: మొత్తంగా 8 సీజన్లు సాగిన ఈ టీవీ సిరీస్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే చివరి సీజన్ క్లైమాక్స్ మాత్రం చాలా మంది ప్రేక్షకులను నిరాశ పరిచింది. అప్పటివరకు వచ్చిన సీజన్లతో చివరి సీజన్ పై చాలా అంచనాలు పెరిగాయి. కానీ, ఆ అంచనాలను 8వ సీజన్ మాత్రం చేరుకోలేకపోయింది. ఒక నాలుగో ఎపిసోడ్ మాత్రం ఊపిరి బిగపట్టేంతలా ఉన్నా చివరి ఆరో ఎపిసోడ్ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఇక దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన 'హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్' (House of the Dragon) కూడా మంచి విజయం సాధించింది.

ఎనిమిది ఏళ్లుగా: 2011 నుంచి 2019 వరకు అశేషంగా ఆకట్టుకున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇప్పటి వరకు ఇంగ్లీషులోనే ఉండటం వలన చాలమంది తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారు. తెలుగులో డబ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు వారి కల నెరవేర బోతుంది. ఈ సిరీస్ ను భారతీయ భాషల్లోకి అనువాదం చేసి త్వరలో విడుదల చేయనున్నారు.

ఒప్పందం రద్దు: HBO సిరీస్ అయిన గేఫ్ ఆఫ్ థ్రోన్స్ ఎన్నో సంవత్సరాలుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా సాగిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్, హెచ్.బి.వో ఒప్పందం ఇటీవలే రద్దు అయింది. దీంతో మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉండే హెచ్.బి.వో కంటెంట్ ను పూర్తిగా తొలగించారు. తర్వాత హెచ్.బి.వో కంటెంట్ స్ట్రీమింగ్ రైట్స్ ను జియో సినిమా (Jio Cinema) దక్కించుకుంది. ప్రస్తుతం జియో సినిమాలో సబ్ స్క్రిప్షన్ ద్వారా గేఫ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమింగ్ అవుతోంది.
జియో సినిమాలో: తాజాగా జియో సినిమా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఈ సిరీస్ ను జియో సినిమాలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలో స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయనుందని సమాచారం. అయితే రానా నాయుడు సిరీస్ లోని బూతులకే తెలుగు జనం గగ్గోలు పెట్టారు. మరి జీవోటీలోని హ్యూమన్ రిలేషన్స్, ఇంగ్లీషులోని డైలాగ్స్ ను ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో డబ్ చేస్తే ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











