twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Writer Movie Review : సముద్రఖని నట విశ్వరూపం.. సినిమా ఎలా ఉందంటే?

    |

    రేటింగ్: 2.75/5

    సినిమా: రైటర్
    విడుదల: ఆహా ఓటీటీ
    నటీనటులు: సముద్రఖని, ఇనేయ, మహేశ్వరి, లిజ్జి ఆంటోనీ, హరికృష్ణన్ అన్బు దురై, మేర్కు తొడర్చి మలై ఆంటోనీ తదితరులు
    రచన, దర్శకత్వం: ఫ్రాంక్లిన్ జాకబ్
    తెలుగు మాటలు: వేణుబాబు చుండి
    సినిమాటోగ్రఫీ: ప్రతీప్ కాళీ రాజా
    సంగీతం: గోవింద్ వసంత
    నిర్మాత: పా రంజిత్

    నటుడిగా మారిన దర్శకుడు సముద్రఖని ఈ మధ్యకాలంలో అనేక తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటించి తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న సినిమాలను సైతం తెలుగువారికి దగ్గర చేసేందుకు ఆహా సంస్థ రైటర్ అనే సినిమాని తెలుగులో అనువదించి విడుదల చేసింది.. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. మరి రైటర్ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం.

    రైటర్ సినిమా కథ ఏమిటంటే

    రైటర్ సినిమా కథ ఏమిటంటే


    రంగరాజు (సముద్రఖని) అనకాపల్లి పోలీస్ స్టేషన్లో రైటర్ గా పని చేస్తూ ఉంటాడు. రంగరాజు పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు ఒక యూనియన్ ఉండాలని పోరాడుతూ ఉంటాడు. ఈ విషయం నచ్చని పై అధికారులు అతనిని విశాఖకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే కొత్త ప్రాంతం కావడంతో ముందు తాను వెళ్లి కుటుంబాన్నీ తర్వాత తీసుకువెళ్లాలని అక్కడికి వెళ్ళిన రంగరాజుకు మొదటిరోజే దేవకుమార్(హరీష్ కృష్ణన్)తో ఒక ఇబ్బందికర సన్నివేశం ఎదురవుతుంది. తన కస్టడీలో ఉండాల్సిన అతను పారిపోతుంటే, కష్టపడి పట్టుకుంటాడు. అయితే ఆ తర్వాత అతనిని తప్పించడం కోసం రంగరాజు ఒక ప్లాన్ చేస్తాడు. కస్టడీలో ఉండాల్సిన వ్యక్తిని రంగరాజు ఎందుకు తప్పించాలని అనుకున్నాడు? అసలు పోలీస్ స్టేషన్ లో కాకుండా ఒక కళ్యాణ మండపంలో అతనిని పోలీసులు ఎందుకు అదుపులో ఉంచుకుంటారు అనేది అసలు సినిమా.

    సినిమాలో ట్విస్టులు

    సినిమాలో ట్విస్టులు


    సినిమా మొదలు నుంచి చివరి వరకు కూడా ఎలాంటి సస్పెన్స్ కు తావులేకుండా సాగిపోతూ ఉంటుంది. ప్రారంభంలోనే రంగరాజు కుటుంబ నేపథ్యాన్ని వివరించి అతని మనస్తత్వం ఎలాంటిది అనే విషయం మీద దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఆ తర్వాత పెద్దగా ఆలస్యం చేయకుండా కథలోకి తీసుకువెళతాడు. పోలీసు వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులను అధికారులు ఎలా చూస్తారు? పోలీసు వ్యవస్థలో కులాల ప్రస్తావన వాటి ప్రాముఖ్యత ఎలా ఉంది అనే విషయాలను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా చూపించడం లో సక్సెస్ అయ్యారు. ఎక్కడా కూడా సాగదీసిన ఫీలింగ్ రాకూడదు అని చాలా కష్టపడ్డారు కానీ ఒకానొక దశలో ఎందుకింత సాగతీస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే పోలీసు కస్టడీలో ఉన్న హరీష్ ఏదైనా అమ్మాయి వ్యవహారంలో దొరికి ఉండవచ్చు అని భ్రమ కల్పించి చివరికి ట్విస్ట్ రివీల్ చేయడం మాత్రం అందరికీ ఒక షాక్ లాగా అనిపిస్తుంది.

     విశ్లేషణ

    విశ్లేషణ


    సినిమా నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు పా రంజిత్ మార్క్ సినిమా మీద కనిపించింది. ఎక్కువగా ఆయన చేసిన సినిమాలలో తక్కువ కులానికి చెందిన వ్యక్తులను ఎక్కువ కులం వారు అణగ తొక్కుతున్నారు అనే అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే అంశాన్ని ఈ సినిమాలో కూడా ప్రస్తావించారు. కేవలం నేటి సామాన్యుల మధ్యే కాదు పోలీసు అధికారులు కూడా తక్కువ కులం పోలీసులను ఎలా వేధిస్తున్నారు అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. గంజాయి వనంలో తులసి మొక్కలా పోలీసు వ్యవస్థలో రంగరాజు వంటి వారు ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన ఎలాంటి అద్భుతాలు జరిగిపోవు అనే విషయాన్ని కాస్త బాధ పెట్టి మరీ అర్థం అయ్యేలా చెప్పారు. అయితే రంగరాజు క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం బాగా సమయం తీసుకోవడంతో ఒకానొక దశలో సహనం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది.

     నటీనటుల విషయానికి వస్తే

    నటీనటుల విషయానికి వస్తే


    ఈ సినిమాలో రంగ రాజు పాత్రలో సముద్రఖని నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పక తప్పదు. న్యాయానికి అండగా నిలబడుతూ తమ డిపార్ట్మెంట్లో వారిని ఎదిరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము అనే విషయం తెలిసి కూడా నిర్మొహమాటంగా న్యాయం వైపు నిలబడే పోలీసు పాత్రలో సముద్రఖని జీవించారు. హరికృష్ణన్ నటన కూడా అద్భుతంగా కుదిరింది. తక్కువ కులానికి చెందిన కానిస్టేబుల్ పాత్రలో ఇనేయ సరిగ్గా సరిపోయింది. మిగతా పాత్రధారులు తమ తమ పరిధిమేర నటించారు.

    టెక్నికల్ విషయానికి వస్తే

    టెక్నికల్ విషయానికి వస్తే


    దర్శకుడు ఫ్రాంక్లిన్ జాకబ్ మీద పా రంజిత్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కథకు ఎమోషన్స్ జోడించి హృదయానికి హత్తుకునే విధంగా సినిమా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో కొంత వరకూ సఫలీకృతులయ్యాడు. కొంతమేర నిడివి తగ్గించి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది. తెలుగులో మాటలు అందించిన వేణుబాబు తమిళ తెలుగు నేటివిటీ కనెక్ట్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత దృష్టి పెట్టాల్సింది. సినిమాకు నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయింది.. ఇక నిర్మాణ విలువలు సినిమా పరిధిమేర బాగున్నాయి.

    Recommended Video

    F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | #Review | FilmiBeat Telugu
     ఇక ఫైనల్ గా చెప్పాలంటే.

    ఇక ఫైనల్ గా చెప్పాలంటే.


    రెగ్యులర్ పోలీస్ డ్రామా అనుకుంటే పొరపాటు పడినట్టే. భిన్నమైన కథతో పోలీసుల ప్రవర్తన ఎలా ఉంటుంది వారి మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది సినిమా.. ఎప్పటిలాగే తమిళ నేటివిటీకి తగినట్లు చాలా సహజంగా రూపొందించిన సినిమా ఇది. సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగినా సరే ఓటీటీలో ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా ఓసారి చూసేయొచ్చు.

    English summary
    here is samuthirakani starrer writer movie directed by Franklin Jacob and produced by Pa. Ranjith.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X