OTT ఓటీటీలో దుమ్మురేపుతున్న యక్షిణి వెబ్ సిరీస్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్‌లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని "యక్షిణి" సిరీస్ ను రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో "యక్షిణి" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నది.

డిస్నీ + హాట్ స్టార్‌తో కలిసి ఆర్కా మీడియా రూపొందించిన రెండో సిరీస్. రొమాన్స్, కామెడీ, డ్రామా లాంటి అంశాలతో తేజా మార్ని రూపొందించారు. గతంలో విఠలాచార్య లాంటి దర్శకులే ఇలాంటి కథలను చెప్పడం చెల్లింది. ఈ సిరీస్ పూర్తిగా దర్శకుడు తేజ మార్ని ఓ విజన్‌తో రూపొందించారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కు భారీగా ప్రమోషన్స్ చేయడంతో మంచి బజ్ ఏర్పడింది.

Yakshini Web Series getting good Response in Disney Hotstar OTT

యక్షిని కథ విషయానికి వస్తే.. అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమ్మీదకు యక్షిణి వస్తుంది. ఓ ముని శాపం వల్ల మానవ కన్యగా మారిపోతుంది. అయితే వంద మందిని ప్రేమించి పెళ్లి చేసుకొని చంపితేగానీ శాపవిముక్తి కాదు. ఆ వంద మందిని ఎలా చంపింది. వందో వ్యక్తి ఎవరు అనేది ఈ సిరీస్ స్టోరి.

తెలుగు సినిమా రంగంలో తమదైన నటనతో ఆకట్టుకొంటున్న మంచు లక్ష్మీ, వేదిక, అజయ్, రాహుల్ విజయ్, దయానంద్ రెడ్డి, జెమినీ సురేస్, ప్రణిత, సత్యశ్రీ, తేజ కాకుమాని, తెనాలి శకుంతల తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చితానికి జోహర్, అర్జున పాల్గుణ, కోట బొమ్మాలి పీఎస్ చిత్రాలను రూపొందించిన తేజా మార్ని ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం డిస్నీహాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

Yakshini Web Series getting good Response in Disney Hotstar OTT

అయితే ఈ వెబ్ సిరీస్‌ను పిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ మంచిగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం జోనర్. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌ కొత్త అనుభూతిని పెంపొందిస్తున్నాయి. అజయ్ సీన్లు చూస్తే భయపెట్టే విధంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ వెబ్ సిరీస్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ. ఓటీటీలో భారీ స్పందన వస్తున్నది. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న యక్షిణి ఈ వారం అత్యధిక వ్యూయింగ్ మినన్స్ సాధించిన వెబ్ సిరీస్‌గా ఘనతను సాధించింది. ఈ వెబ్ సిరీస్ రానున్న రోజుల్లో ఓటీటీలో ఎలాంటి సందడి చేస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X