OTTని షేక్ చేస్తున్న టాప్ 3 చిత్రాలివే.. వన్‌లో ఆర్టికల్ 370, మిగతా స్థానాల్లో ఏమున్నాయంటే?

ఓటీటీల హవా పెరిగిపోయినప్పటి నుంచి అనేక ముంది ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసేస్తున్నారు. ప్రతీ వారం సరికొత్త చిత్రాలు వస్తుండగా.. అన్నింటనీ వదలకుండా చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ వీటిలో ట్రెండ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లపై సర్వేలు చేస్తోంది. ముఖ్యంగా ఈ వారం ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు టాప్ 3లో నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన సర్వేలో టాప్ 1లో యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆర్టికల్ 370 నిలిచింది. 2019 ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామా దాడి జ‌రిగిన అనంతరం జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ర‌ద్దు చేసే అంశాన్ని ప్రధానంగా తీసుకొని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఆదిత్య ధ‌ర్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభ దర్శకత్వం వహించారు. యామీ గౌత‌మ్ తో పాటు ప్రియమణి, రాజ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23వ తేదీన విడుదల చేశారు.

Yami Gautam Article 370 Movie And other Two Movies Trending in OTT Check Details

20 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.110 కోట్లు రాబట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. పలు దేశాలు ఈ చిత్రాన్ని బ్యాన్ కూడా చేశాయి. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఏప్రిల్ 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అద్భుతమైన సినిమాను మీరు కూడా ఓసారి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

అలాగే టాప్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా చేసిన ఫైటర్ సినిమా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ వహించారు. అలాగే వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించి మెప్పించింది.

Yami Gautam Article 370 Movie And other Two Movies Trending in OTT Check Details

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో వీరు మాత్రమే కాకుండా ఫైటర్ చిత్రంలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్, ఆమిర్ నాయక్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో పోషించారు. జనవరి 25వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక టాప్ 3లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా నిలిచింది. మాడాక్‌ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దినేష్‌ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్‌జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, షాహిద్‌ కపూర్‌, కృతి సనన్, రాకేష్ బేడీ, అనుభఆ ఫుతేపురియా, రాజేష్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 26వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇలా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X