OTTలోకి రూ.100 కోట్ల ట్రెండింగ్ కాంట్రవర్సీ మూవీ - ఈ సినిమా చుట్టూ అన్నీ వివాదాలే!
సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినా అవ్వకపోయినా వాటికోసం ఓటిటి ఆడియన్స్ మాత్రం విపరీతంగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే థియేటర్లలో పెద్దగా హిట్ కాదు అనిపించుకున్న సినిమాలు సైతం బాగున్నాయని ఓటీటీ ఆడియన్స్ తీర్పు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో ఎప్పుడెప్పుడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయా అని మేకర్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి.
ఈ మధ్యకాలంలో నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగింది. వీలైతే బయోపిక్స్ లేదా ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా అలాంటి సినిమాలు చేయడానికి మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే కోవలో జమ్మూ కశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కింది దాని పేరే ఆర్టికల్ 370.

బాలీవుడ్ లో హీరోయిన్ యామి గౌతమ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్ దర్శకుడిని వివాహం చేసుకుని అక్కడే సెటిలైపోయింది. ఆమె ఆర్టికల్ 370 సినిమాతో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లలో విడుదలైన ఆర్టికల్ 370 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడమే కాదు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మన హీరోయిన్ ప్రియమణి కూడా ఒక కీలక పాత్రలో మెరిసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చాటిన ఈ సినిమా ఈ ఏడాది బాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోయిన ఈ సినిమాకి థియేటర్ రన్ పూర్తయింది. ఈ క్రమంలోని ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి రంగం సిద్ధమైంది.

తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ కాబోతుందనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ ఇండియన్ ఓటిటి ఫ్లాట్ ఫాంగా జియో సినిమా ఈ సూపర్ హిట్ ఆర్టికల్ 370 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి కూడా తాజాగా ఒక అధికారికి ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 19వ తేదీ అంటే వచ్చే నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా జియో సినిమా యాప్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
అయితే ఈమధ్య ఒక భాషలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ఓటీడీలో రిలీజ్ అవుతున్నప్పుడు ఇతర భాషల్లో సైతం డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి తెలుగు సహా దక్షిణాదిభాషలో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











