మరింత ముందుగానే ఓటీటీలోకి వంద కోట్ల సినిమా.. వాళ్లకు ఫ్రీగా చూసే ఛాన్స్
ఈ మధ్య కాలంలో దేశంలోని చాలా భాషల్లో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా సినిమాలు రూపొందుతోన్నాయి. అలా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా దేశ భక్తితో ముడిపడి ఉన్న కథలతోనూ మూవీలు తెరకెక్కాయి. అలాంటి వాటికి భారీ రెస్పాన్స్ కూడా లభించింది. ఇలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేశ భక్తికి సంబంధించిన సినిమానే 'ఆర్టికల్ 370'.
యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించిన సినిమానే 'ఆర్టికల్ 370'. దేశంలోనే అత్యంత ముఖ్యమైన ఓ ఆర్టికల్ రద్దుకు ముందు జరిగిన మిషన్ ఆధారంగా ఈ మూవీ రూపొందడంతో దీనిపై ఆరంభంలోనే హైప్ క్రియేట్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వంలో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఫలితంగా ఈ చిత్రం రూ. 110 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది.
రియల్ స్టోరీతో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం జియో సినిమా సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అత్యధిక రేటుకు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీ స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతనే ఉంటుందని టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఇది ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఏప్రిల్ 12వ తేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతుందట. అంతేకాదు, దీన్ని జియో ఫ్రీగానే అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. 'ఆర్టికల్ 370' మూవీని జియో స్టూడియోస్, బీబీ6 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ నిర్మించారు. షశ్‌వత్ సచ్‌దేవ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ప్రియమణి, అరుణ్ గోవలీ, వైభవ్, కిరణ్ కర్మాకర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











