100 కోట్ల సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఫ్రీగా చూడాలా? అయితే ఇలా చేయండి!
ఒకప్పుడు సున్నితమైన లేదా వివాదాస్పదమైన అంశాలపై పెద్దగా సినిమాలు వచ్చేవి కాదు. అలా వచ్చినా ఆ చిత్రాలకు ఎన్నో సమస్యలు ఏర్పడేవి. అయితే, ఇప్పుడు మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ తరహా మూవీలు రూపొందుతోన్నాయి. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. అలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఆర్టికల్ 370'.
ఫేమస్ హీరోయిన్ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంభలే తీసిన చిత్రమే 'ఆర్టికల్ 370'. దేశంలోనే అత్యంత ముఖ్యమైన ఓ ఆర్టికల్‌ను రద్దు చేయడానికి ముందు జరిగిన మిషన్ నేపథ్యంతో ఈ మూవీ రూపొందింది. దీంతో దీనిపై ఆరంభంలోనే హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లే దీన్ని ఎన్నో అంచనాలతో ఫిబ్రవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఆదిత్య సుహాస్ జంభలే డైరెక్షన్‌లో రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా లభించాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఫలితంగా ఈ చిత్రం రూ. 120 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా రూపొందిన 'ఆర్టికల్ 370' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ సంస్థ జియో సినిమా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై అదిరిపోయే న్యూస్ లీక్ అయింది.
'ఆర్టికల్ 370' మూవీ స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతనే ఉంటుందని టాక్ వచ్చింది. కానీ, ఇది ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని ఏప్రిల్ 19 నుంచే జియో సినిమా స్ట్రీమింగ్ చేయబోతుందట. అంతేకాదు, ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఫ్రీగానే ఈ చిత్రాన్ని చూపించబోతుందని తెలిసింది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్.

ఇదిలా ఉండగా.. 'ఆర్టికల్ 370' మూవీని జియో స్టూడియోస్, బీబీ6 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ నిర్మించారు. ఇందులో ప్రియమణి, అరుణ్ గోవలీ, వైభవ్, కిరణ్ కర్మాకర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. షశ్‌వత్ సచ్‌దేవ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











