Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Yashoda OTT: ఎట్టకేలకు ఆ ఓటీటీలోకి యశోద.. సమంత ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న హీరోయిన్ సమంత రూత్ ప్రభు. కెరీర్‌ను మొదలు పెట్టిన చాలా కాలం వరకూ గ్లామర్ పాత్రలనే చేసుకుంటూ వచ్చిన ఈ భామ.. ఈ మధ్యన మాత్రం పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే ఎక్కువగా చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే సమంత 'యశోద' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Bigg Boss Elimination: తొలిరోజే ఓటింగ్‌లో సెన్సేషన్.. ఇనాయాకు షాక్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'యశోద'. ఈ మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. సరోగసి కాన్సెప్టుతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. దీంతో టార్గెట్ చేరుకుని హిట్‌గా నిలిచింది. తద్వారా సమంత కెరీర్‌లోనే సోలో బిగ్ సక్సెస్‌గా 'యశోద' చిత్రం నిలిచింది.

యశోద మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకి సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని చాలా రోజుల క్రితమే స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాపై ఇటీవల ఇవా ఆసుపత్రి యాజమాన్యం సినిమాలో తమ పేరును వాడడంపై పరువు నష్టం దావా వేసింది. దీంతో ఇది వివాదంగా మారి డిజిటల్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. అయితే, ఇటీవలే ఇది పరిష్కారం అవడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 'యశోద' మూవీని స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దీన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది.
లేలేత అందాలతో రెచ్చగొడుతోన్న దీప్తి సునైనా: తొలిసారి ఆ పార్ట్స్ చూపిస్తూ!
హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమే 'యశోద'. సమంత ప్రధాన పాత్రను చేసిన దీన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలను పోషించారు. దీనికి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.