Yashoda on Amazon Prime Video ఓటీటీలోను దుమ్మురేపుతున్న సమంత మూవీ.. ఎన్నోస్థానంలో ట్రెండింగ్ అంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై సమంత రుత్ ప్రభు హీరోయిన్‌గా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన లేడి ఓరియెంటెడ్ సినిమా యశోద దిగ్విజయంగా థియేట్రికల్ రిలీజ్‌ను పూర్తి చేసుకొని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశోద చిత్రం డిసెంబర్ 9వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఓటీటీలో భారీ రెస్పాన్స్‌ను కూడగొట్టుకొంటున్నదనే విషయం నెటిజన్ల స్పందనతో స్పష్టమైంది. ఈ సినిమా సాధించిన విజయం, అలాగే అమెజాన్ ప్రైమ్‌లో వస్తున్న స్పందన వివరాల్లోకి వెళితే..

భారీ లాభాలతో థియేట్రికల్ రిలీజ్

యశోద చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14.85 కోట్ల షేర్, 32.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. సమంత కెరీర్‌లో వచ్చిన.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించింది. దాదాపు 3 కోట్ల మేర లాభాలను పంచిపెట్టింది. 2022 సంవత్సరంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రంగా యశోద నిలిచింది.

డిసెంబర్ 9వ తేదీన ఓటీటీలో


డిసెంబర్ 9వ తేదీ రాత్రి అమెజాన్‌లో రిలీజైన యశోద చిత్రం ఇండియా వ్యాప్తంగా టాప్ 2 ట్రెండింగ్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి నెటిజన్లు, అభిమానులు షేర్ చేస్తున్న అభిప్రాయాలను సమంత షేర్ చేస్తున్నది. ఈ సినిమాకు వస్తున్న స్పందనను చూసి సమంత థ్రిల్ అవుతున్నారు.

 సమంత పెర్ఫార్మెన్స్ అద్బుతంగా

సమంత పెర్ఫార్మెన్స్ అద్బుతంగా


యశోద ఓటీటీలో రిలీజ్ తర్వాత ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. సమంత ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాను. స్క్రిప్టు అద్బుతంగా ఉంది. క్లైమాక్స్ సూపర్‌గా ఉంది. ఈ సినిమాలో ట్విస్టును చాలా ఎంజాయ్ చేశాను. సమంత యాక్షన్ సీన్లను బాగా నచ్చాయి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అద్బుతంగా హ్యాండిల్ చేశారంటూ..


యశోద మూవీ ఎక్కడా బోర్ కొట్టకుంా చాలా బాగుంది. దర్శకులు హరి శంకర్, హరీష్ నారాయణ్ అంటెప్ట్ బాగుంది. స్క్రిప్టును సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేశారు. సమంత ఈ సినిమా మెయిన్ పిల్లర్ ఫెంటాస్టిక్ ఫెర్పార్మెన్స్‌తో అదరగొట్టిది అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

వరల్డ్ సినిమాలో స్టాంగెస్ట్ హీరోయిన్‌గా


అమెజాన్ ప్రైమ్‌లో యశోద సినిమా చూశాను. సినిమాను అద్బుతంగా రూపొందించారు. సమంత నటించిన తీరు చూస్తే.. ఇంకొకరు ఈ సినిమాను ఈ రేంజ్‌ హిట్ చేయడం కష్టం. సినిమాలో ఎలాంటి లోపాలు కనిపించలేదు. ఎమోషన్స్ భారీగా పండాయి. యశోద సినిమాతో వరల్డ్ సినిమాలో స్టాంగెస్ట్ హీరోయిన్‌గా తనకు తాను ప్రూవ్ చేసుకొన్నది అని ఓ నెటిజన్ తెలిపారు.

 స్వీట్‌గా, క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా

స్వీట్‌గా, క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా


యశోద మూవీ వేరే లెవెల్‌లో ఉంది. సమంత పవర్‌ఫుల్‌గా, స్వీట్‌గా, క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా నటించింది. ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రను ఫర్‌ఫెక్ట్‌గా సమంత పోషించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X