Gorre Puranam OTT: ఓటీటీలోకి సుహాస్ ‘గొర్రె పురాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Gorre Puranam OTT Release: ఓటీటీలకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం రెండు లేదా మూడో వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ ఓటీటీలకే ఓటేస్తున్నారు. మెయిన్ గా చాలా తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం ఒకే సారి ఇంట్లో కూర్చోని మూవీ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. కొన్ని సినిమాలు అయితే.. నేరుగా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారంటే.. ఓటీటీ మార్కెట్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీలకు ఈ రేంజ్ లో పెరుగుతుండటంతో కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి ఓటీటీ సంస్థ. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ టాలెండెంట్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ ఓటీటీలో సందడి చేయబోతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఓ లూక్కేయండి.

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల సుహాస్ నటించిన చిత్రం' గొర్రె పురాణం'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఓ డిఫరెంట్ స్టోరీతో డైరెక్టర్ బాబీ గొర్రె పురాణం అనే మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 20న విడుదలైన గొర్రె పురాణం మూవీ ఓ డిసెంట్ టాక్ తెచ్చుకుంది.

Young Hero Suhas Gorre Puranam Movie Ready To Stream on October 10th in Aha full Details here

ఈ వైవిధ్యమైన మూవీలో పోసాని కృష్ణ మురళి, రఘు ప్రధాన పాత్రలు పోషించారు. గొర్రె పురాణం మూవీని ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్‌రెడ్డి నిర్మించారు. పవన్ సి.హెచ్ సంగీతం అందించారు. గొర్రె పురాణం అనే టైటిల్‌ కు తగ్గట్టే ఈ సినిమా అంతా.. ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలా నలిగిపోతుందో చక్కగా చూపించారు మూవీ మేకర్స్. కథ విషయానికి వస్తే.. బక్రీద్‌ పండుగ నాడు ఓ ముస్లిం వ్యక్తి తన ఇంట్లో గొర్రె బలి ఇవ్వాలని తీసుకవస్తాడు.

కానీ, ఆ గొర్రె తప్పించుకుని ఓ గుడిలోకి వెళ్లింది. దీంతో ఇరు మతాల వారు గొర్రె తమదంటే.. తమదని, తామంటే.. తాము బలిస్తామని గొడవకు దిగుతారు. ఇలా ఒక గొర్రె కోసం రెండు వర్గాల మధ్య గొడవలకు కారణమవుతోంది. చివరికి ఏమైందో తెలియాలంటే.. హీరో సుహాస్ నటించిన గొర్రె పురాణం చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. భారీ అంచనా మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ లో అనుకున్న స్థాయిలో ఆడలేడు. అలాంటి మూవీ గొర్రె పురాణం డిజిటల్ రైట్స్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

Young Hero Suhas Gorre Puranam Movie Ready To Stream on October 10th in Aha full Details here

ఇలా డిపెరెంట్ కాసెప్ట్ తో వచ్చిన గొర్రె పురాణం మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఓ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ మూవీని మూవీ కూడ చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Read more about: suhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X