Youth OTT Release: 6 కోట్లతో తీస్తే 70 కోట్లు.. ఆ ఓటీటీలోకి యూత్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన తాయ్ కెలవి, వాజా 2, యూత్ తదితర చిత్రాలు భారీ వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఈ కోవలోకే వస్తుంది యూత్ మూవీ. లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..

యూత్ తారాగణం
కెన్ కరుణాస్ దర్శకత్వంలో ఈ యూత్ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పర్వత ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ట్రీట్ బాయ్ స్టూడియోస్, మాలీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్ బ్యానర్లపై కరుప్పయ్య సీ రామ్, సులోచనా కుమార్, కాళి రాజ్‌కుమార్, ప్రభ ప్రేమ్ కుమార్ సంయుక్తంగా ఈ యూత్ చిత్రాన్ని నిర్మించారు. కెన్ కరుణాస్, సూరజ్ వెంజరమూడు, దేవదర్శిని, అనిష్మా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. నాష్ ఎడిటర్‌గా, వికీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Youth Movie OTT Release on Netflix from April 16 in Multiple Languages

యూత్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి యూత్ సినిమాకు 6 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 7 కోట్ల రూపాయల షేర్.. 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్‌గా నిర్ణయించారు. ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న యూత్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

యూత్ కలెక్షన్స్
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ యూత్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలి వారం 26.44 కోట్ల రూపాయలు, రెండో వారంలో 16.18 కోట్ల రూపాయలు, మూడో వారంలో 8.15 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 51.14 కోట్ల రూపాయల నికర వసూళ్లు.. 58.69 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

యూత్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్‌లోనూ యూత్ మూవీ తిరుగులేని ఆదరణను దక్కించుకుంది. నార్త్ అమెరికాతో పాటు యూరప్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో 11.40 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి యూత్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 70.09 కోట్ల రూపాయలు వసూలైంది. తమిళనాడులో 51.57 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.03 కోట్ల రూపాయలు, కేరళలో 1.35 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 5.60 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. పెట్టిన పెట్టుబడి మీద దాదాపు 700 శాతం లాభాలను అందించి కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది యూత్.

యూత్ ఏ ఓటీటీలో?
యూత్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్‌లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ కావాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏప్రిల్ 16 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో యూత్ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్‌లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Read more about: youth netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X