twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shanmukh Jaswanth: ఖరీదైన డ్రీమ్ కారు కొనుగోలు చేసిన షన్ను.. రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

    |

    యూట్యూబ్ గా మంచి గుర్తింపు అందుకున్న అతికొద్దిమంది తెలుగువారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. అతను చేసే వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో షన్ను వెబ్ సిరీస్ ల ద్వారానే భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్నారు. ఇక అతను మరొక ఖరీదైన కారును కొనుగోలు చేయడం విశేషం. ఇప్పటికే కొన్ని మంచి కార్లను కొనుక్కున్న అతను ఇప్పుడు ఏకంగా బిఎండబ్ల్యూ బ్రాండ్ కారును కొనుగోలు చేశాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా షేర్ చేసుకున్నాడు. ఇక కారు విలువ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

    మొదట్లో అలా క్రేజ్

    మొదట్లో అలా క్రేజ్

    మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన షణ్ముఖ్ జస్వంత్ వైవా టీమ్ తో ట్రావెల్ అయ్యాడు. అందులో అతనికి మంచి గుర్తింపు లభించింది. వైవా ఛానల్ కామెడీ న్యూస్ ల తోనే షణ్ముఖ్ యూట్యూబ్లో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసిన అతను మరో రేంజ్ కు వెళ్ళాడు. షణ్ముఖ్ జశ్వంత్ ఎలాంటి షార్ట్ ఫిలిమ్ చేసినా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.

    వెబ్ సీరీస్ లతో..

    వెబ్ సీరీస్ లతో..

    తెలుగులో మంచి ఎంటర్టైన్మెంట్ అందించే అతి కొద్దిమంది యూట్యూబ్ సెలబ్రిటీలలో షణ్ముఖ్ జస్వంత్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అతనికి వెబ్ సిరీస్ లు కూడా బాగా హెల్ప్ అయ్యాయి. అందులో సాఫ్ట్ వేర్ డెవలవ్ పర్ తో పాటు సూర్య అనే మరొక వెబ్ సిరీస్ కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచింది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఇవ్వగలడు అని ప్రేక్షకుల్లో అతనికి ఒక గుర్తింపు లభించింది.

     బిగ్ బాస్ ద్వారా మంచి ఆదాయం

    బిగ్ బాస్ ద్వారా మంచి ఆదాయం

    ఇక షణ్ముఖ్ జస్వంత్ పలు రియాల్టీ షో లతో కూడా ఎంతగానో మెప్పించాడు. ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా అతనికి మరొక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయితే అందింది. అక్కడే అతనికి ఆదాయం కూడా పెరిగింది అని చెప్పాలి. బిగ్ బాస్ ద్వారా అతను దాదాపు 50 నుంచి 60 లక్షల మధ్యలో రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు అప్పట్లో ఒక టాక్ అయితే వినిపించింది.

    షన్ను డ్రీమ్ కారు

    షన్ను డ్రీమ్ కారు

    ఇక రీసెంట్ గా షణ్ముఖ్ తనకు ఎంతో ఇష్టమైన బిఎండబ్ల్యూ బ్రాండ్ కారును కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇది ఒక డ్రీమ్ లో ఉంది అంటూ నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజిషన్లో చూడాలి అనుకున్నది మీరే అని ఫ్యాన్స్ గురించి కూడా చెప్పాడు. నా స్నేహితులు మాత్రమే కాకుండా చాలామంది ఈ విజయంలో తోడ్పాటు అయినట్లుగా తెలియజేశాడు.

    లిఫ్ట్ మాత్రం పక్క

    లిఫ్ట్ మాత్రం పక్క

    అంతేకాకుండా సరదాగా షణ్ముఖ్ జస్వంత్ మరొక కామెంట్ కూడా చేశాడు. ఇది మన కారంటూ ఎప్పుడు కనిపించిన కూడా చెప్పండి లిఫ్ట్ మాత్రం పక్కా ఇస్తాను అని అన్నాడు. అంతే కాకుండా విజయదశమి శుభాకాంక్షలు అని తన తల్లిదండ్రులతో ఉన్న ఒక వీడియోను షేర్ చేసుకున్నాడు.

    రేటు ఎంతంటే?

    ఇక బిఎండబ్ల్యూ టూ సిరీస్ గ్రాండ్ కౌప్ కార్ కారు వాల్యూ ఎంత అనేది ప్రస్తుతం ఇంటర్నెట్ లో కూడా షన్ను ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ కారు ధర అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఆన్ రోడ్ ప్రైస్ టాప్ మోడల్ అయితే 44.5 లక్షలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక షణ్ముఖ్ ఎంతో కాలంగా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నాడు. ఇక మొత్తానికి ఈ సీరీస్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    Youtuber Shanmukh Jaswanth bought an expensive car cost details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X