OTT: జీ5 ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. ప్రభాస్ తమ్ముడి మూవీ నెంబర్ 1 స్థానంలో!

ప్రస్తుతం మన దగ్గర బాగా తెలిసిన ఓటిటి యాప్స్ ఏవి అంటే నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లాంటివి చెప్తారు. అయితే ఇవి కాకుండా మన దేశానికీ చెందిన కొన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు కూడా ఉన్నాయి. కాగా ఇందులో జీ 5 కూడా ఒకటి. దేశంలోనే అతి పెద్ద టెలివిజన్ నెట్వర్క్ లో ఒకటైన జీ సంస్థ నుంచి వచ్చిన ఈ స్ట్రీమింగ్ యాప్ లో కూడా మంచి కంటెంట్ ఉంటుంది. కాకపోతే ఇతర వాటిలా ఇంటర్నేషనల్ కంటెంట్ కంటే దేశి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మరి ఇందులో కూడా మంచి సినిమాలే తీసుకుంటారు. అలా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు ఏంటి? తెలుగు, హిందీలో ఏమేం ట్రెండ్ అవుతున్నాయి అనేది చూద్దాం..

మొదటిగా టాప్ 10 లో చూస్తే బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అయినటువంటి 'ఉరి' ట్రెండ్ అవుతుంది. పుల్వామా దాడుల విషయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ నటించగా ఎప్పుడో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు కూడా టాప్ 10 లో ట్రెండ్ అవ్వడం విశేషం.

Zee 5 OTT top 10 trending movies list Prabhas Aadipurush s fame Sunny Singh movie on Top 1

ఇక టాప్ 9 లో చూస్తే మళ్ళీ విక్కీ కౌశల్ నటించిన రీసెంట్ హిట్ సినిమా "సామ్ బహుదూర్" ట్రెండింగ్ లో ఉంది. దీన్ని మేఘన గుల్జార్ దర్శకత్వం వహించగా ఇది హిందీలో అందుబాటులో ఉంది. ఇక టాప్ 8 లో టాలెంటెడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటించిన హిట్ "సైలెన్స్" కి సీక్వెల్ "సైలెన్స్ 2" ఈ ఏడాదిలోనే వచ్చింది. కానీ సైలెన్స్ మొదటి పార్ట్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతుంది. దీన్ని అబాన్ భరూచా దర్శకత్వం వహించారు.

ఇంకా టాప్ 7లో "టారోట్" అనే హాలీవుడ్ థ్రిల్లర్ నిలిచింది. ఈ అమెరికన్ థ్రిల్లర్ లో స్పైడర్ మ్యాన్ నటుడు జాకబ్ బాటలోన్ అలాగే మన తెలుగు నటి అవంతిక వందనపు కూడా నటించింది. కాగా ఈ చిత్రాన్ని అనా హెల్బర్గ్ అలాగే స్పెన్సర్ కోహెన్ లు దర్శకత్వం వహించారు. ఇక టాప్ 6 కి వస్తే ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "హను మాన్" ట్రెండింగ్ లో ఉంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో చిత్రంలో తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

ఇక టాప్ 5 లోకి వస్తే టాప్ 5 లో నటి ఆడ శర్మ నటించిన సెన్సేషనల్ కాంట్రవర్సీ చిత్రం "ది కేరళ స్టోరీ" ట్రెండింగ్ లో ఉంది. ఇది పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండగా ఈ సినిమాని సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇక టాప్ 4 లో కూడా ఇదే ఆదా శర్మ, సుదీప్తో సేన్ కలయికలో వచ్చిన మరో సినిమా "బస్టర్ ది నక్సల్ స్టోరీ" ట్రెండ్ అవుతుంది. అయితే దీన్ని కూడా కేరళ స్టోరీ తరహాలో హిట్ కొట్టేద్దాం అనే రేంజ్ లో ప్లాన్ చేశారు కానీ ఇది భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా హిందీ, తెలుగులో అందుబాటులో ఉంది.

ఇక టాప్ 3 లోస్వాతంత్ర సమరయోధుడు సావర్కార్ వినాయక్ దామోదర్ జీవిత చరిత్రపై రణదీప్ హూడా ప్రధాన పాత్రలో దర్శకుడుగా కూడా తానే చేసిన ఈ చిత్రం డీసెంట్ హిట్ అయ్యింది. ఇది హిందీ, మరాఠీలో స్ట్రీమ్ అవుతుంది. అలాగే టాప్ 2 లో చూసినట్టు అయితే పైన చెప్పుకున్న మనోజ్ బాజ్ పాయ్ నటించిన "సైలెన్స్" సినిమాకి ఈ ఏడాదిలో వచ్చిన సీక్వెల్ "సైలెన్స్ 2" ట్రెండింగ్ లో నిలిచింది.

Zee 5 OTT top 10 trending movies list Prabhas Aadipurush s fame Sunny Singh movie on Top 1

ఇక ఫైనల్ గా మొట్ట మొదటి స్థానంలో ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడిగా నటించిన నటుడు సన్నీ సింగ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ లు నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా "లవ్ కి అరేంజ్ మ్యారేజ్" అనే సినిమా ట్రెండ్ అవుతుంది. ఈ ఏడాదిలోనే వచ్చిన ఈ సినిమాని ఇష్రాత్ ఆర్ ఖాన్ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X