Ooru Peru Bhairavakona OTT: ఆ ఓటీటీలోనే సందీప్ కిషన్ మూవీ.. ఎప్పటి నుంచి వస్తుందంటే!

గతంలో కంటే ఇప్పుడు హర్రర్, థ్రిల్లర్ జోనర్‌లో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటివి ఎక్కువగా రూపొందుతోన్నాయి. వాటికి విశేషమైన స్పందన వస్తుండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హర్రర్ మూవీనే 'ఊరు పేరు భైరవకోన'.

టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్ హీరోగా, వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా భారీ హైప్‌తో శుక్రవారమే విడుదల అయింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో సందీప్ కిషన్ మూవీకి మంచి ఓపెనింగ్స్ లభించాయి.

ZEE5 Bagged Ooru Peru Bhairavakona Digital Streaming Rights

విభిన్నమైన సబ్జెక్టుతో తెరకెక్కిన 'ఊరు పేరు భైరవకోన' మూవీపై అంచనాలు భారీగా నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా అవన్నీ భారీ ధరలకు అమ్మడు పోయాయి. అలాగే, నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా హాట్ కేకుల్లా అయిపోయాయి. కానీ, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల డీల్ మాత్రం ఎందుకనో క్లోజ్ కాలేదు.

'ఊరు పేరు భైరవకోన' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ సంస్థకు అమ్మారు అన్నది సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా దీనిపై కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. దీని ప్రకారం.. 'ఊరు పేరు భైరవకోన' డిజిటల్ రైట్స్‌ను జీ5 సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి సంబంధించి స్ట్రీమింగ్ గురించి కూడా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో వచ్చే చాన్స్ ఉంది.

ZEE5 Bagged Ooru Peru Bhairavakona Digital Streaming Rights

ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబోలో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X