HanuMan OTT: 3 వారాల్లోనే హనుమాన్ స్ట్రీమింగ్.. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన ఓటీటీ సంస్థ

చాలా తక్కువ బడ్జెట్, అంచనాలతో వచ్చినా.. కొన్ని సినిమాలు మాత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుని సంచలనాలను సృష్టిస్తుంటాయి. అలాంటి వాటిలో రియల్ సూపర్ మ్యాన్ ఆంజనేయ స్వామి నేపథ్యంతో వచ్చిన 'హనుమాన్' ఒకటి. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా.. తేజ సజ్జా ఇందులో హీరోగా నటించాడు.

సాధారణ అంచనాలతో రూపొందిన 'హనుమాన్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 137 కోట్లకు పైగా వరకూ షేర్‌ను వసూలు అయింది. తద్వారా దీనికి రూ. 105 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఇంకా ఇది అదే జోరును చూపిస్తూ థియేటర్లలో సందడి చేస్తోంది.

Zee5 extended HanuMan Movie Digital Streaming Till 55 days

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీపై ఉన్న అంచనాల వల్ల దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు పోటీ మంచిగానే ఏర్పడింది. దీంతో చాలా సంస్థలు ఓటీటీ హక్కుల కోసం ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే జీ5 సంస్థ 'హనుమాన్' మూవీని చేజిక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ మంచి మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

థియేటర్లలో దండి కొడుతోన్న 'హనుమాన్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. అదే సమయంలో ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయబోతున్నారని కూడా టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అసలైన సమాచారం బయటకు వచ్చింది.

Zee5 extended HanuMan Movie Digital Streaming Till 55 days

వాస్తవానికి 'హనుమాన్' మూవీని థియేటర్లలోకి వచ్చిన మూడు వారాలకే స్ట్రీమింగ్ చేసేలా జీ5 ఒప్పందం చేసుకుందట. కానీ, థియేటర్లలో ఈ చిత్రం చక్కగా రన్ అవుతుండడంతో ఇప్పుడు దీన్ని 55 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ అయ్యారంట. అంటే మార్చి మొదటి వారంలో లేదా రెండో వారంలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Zee5 extended HanuMan Movie Digital Streaming Till 55 days

ఇదిలా ఉండగా.. రియల్ సూపర్ హీరో స్టోరీతో రూపొందిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X