HanuMan OTT: హనుమాన్ స్ట్రీమింగ్‌పై మరో బిగ్ ట్విస్ట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఓటీటీ సంస్థ
ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన చిత్రాలు కూడా ఒక్కోసారి సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన చాలా సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించి సత్తా చాటాయి. అలాంటి ఓ సినిమానే 'హనుమాన్'. టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ మూవీ.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి సత్తా చాటుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జాతో క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమానే 'హనుమాన్'. రియల్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం క్రమంగా అంచనాలను ఏర్పరచుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తర్వాత ఎవరూ ఊహించని విధంగా రూ. 300 కోట్లు గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీ యాభై రోజులకు పైగానే థియేటర్లలో సందడి చేసింది. దీంతో ఇది మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత మార్చి 8వ తేదీన స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా జీ5 సంస్థ ఓ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి నిరాశ పరిచింది.
సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జీ5 సంస్థకు X (ట్విట్టర్) ఖాతాలో ఓ నెటిజన్ 'నేను జీ5 ప్రీమియమ్ కస్టమర్‌ను. హనుమాన్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకు రండి' అంటూ ట్వీట్ రూపంలో రిక్వెస్ట్ చేశాడు.

సదరు నెటిజన్ చేసిన ట్వీట్‌కు జీ5 సంస్థ స్పందించింది. ఈ మేరకు అతడికి సమాధానంగా 'హనుమాన్ మూవీ స్ట్రీమింగ్ గురించి మాకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. వీటి కోసం దయచేసి మీరు మా వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కన్నేసి ఉంచండి' అంటూ ట్వీట్ చేసింది. దీంతో 'హనుమాన్' మూవీ జీ5లో ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.
ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











