RRR మూవీ స్ట్రీమింగ్‌పై జీ సంస్థ శుభవార్త.. వాళ్లందరికీ ఫ్రీగానే చూసే అవకాశం

బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా రేంజ్ భారీ స్థాయిలో పెరగడంతో పాటు ఆరంభంలోనే ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో బిజినెస్‌ను చేసుకుంది. అంతేకాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది వేలకు పైగా థియేటర్లలో గత ఫిబ్రవరిలోనే ఈ సినిమా విడుదలైంది.

తెలుగులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేట్రికల్ హక్కుల మాదిరిగానే.. శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో చాలా రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే దీన్ని జీ5లో మే 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ZEE5 Offers RRR Digital Premiere for FREE from May 20th

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ అంచనాలకు అనుగుణంగానే ఆరంభంలోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఇది మంచి స్పందనను దక్కించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై పంజాను విసురుతూ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇలా కేవలం పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్లను పూర్తి చేసుకుంది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో ఆల్‌టైం ఇండస్ట్రీ రికార్డులను కూడా నమోదు చేసుకుంది. ఇలా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుంది.

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని 'పే ఫర్ వ్యూ' (డబ్బులు చెల్లించి చూసేలా) పద్దతిన అందుబాటులోకి తీసుకు రావాలని జీ5 సంస్థ నిర్ణయించుకుంది. అయితే, దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి వ్యతిరేకత రావడంతో తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 'జీ5 సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లంతా మే 20వ తేదీ నుంచి RRR మూవీని ఉచితంగా చూడొచ్చు. మరోసారి గర్జనను 4కే వీడియోలో ఆస్వాదించండి' అంటూ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇటీవలే జీ5 సంస్థ విడుదల చేసిన స్పెషల్ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే.

ZEE5 Offers RRR Digital Premiere for FREE from May 20th

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలు చేశారు. ఇక, ఈ సినిమా భారీ కలెక్షన్లతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X