HanuMan OTT హనుమాన్ కోసం ఎదురుచూపులు ఫలించాయి.. వచ్చేసింది!

శివరాత్రి నుంచి ఇప్పటి వరకు అంతా హనుమాన్ ఓటీటీ గురించే చర్చ నడుస్తోంది. శివరాత్రికి ఓటీటీలో స్ట్రీమింగ్ అంటూ వార్తలు రాగా.. అవన్నీ అవాస్తమని తేలింది. ఇక ప్రతివారం ఇక హనుమాన్ వచ్చేస్తోంది.. అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ మీద జీ5 సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు వర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ మీద అప్డేట్ ఇచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.

మూడు నెలలు దాటినా...

ఓటీటీలోకి హనుమాన్ ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. ప్రస్తుతం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఓటిటి రిలీజ్ చిత్రం ఏదైనా ఉందంటే... అది హనుమాన్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏ సినిమా అయినా... నెల రోజుల్లోపే ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Zee5 OTT Latest Update on Prashanth Varma HanuMan Telugu Version Release Full Details Here

నెటిజన్స్ ఫైర్...

అయితే హనుమాన్ మూవీ మాత్రం మూడు నెలలు దాటినా... ఇంకా ఓటీటీలోకి రాలేదు. దీంతో నెటిజన్స్ అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శివరాత్రి రోజున హనుమాన్ స్ట్రీమింగ్ అంటూ ప్రచారం సాగింది. ఇక అంతా శివరాత్రి రోజు జగారం చేస్తూ.. హనుమా్ మూవీ చూడాలని అనుకున్నారు. వారి ఆశలపై ఓటీటీ సంస్థ నీళ్లు చల్లింది. ఓటీటీ స్ట్రీమింగ్ ను ఆపేసింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు డిజిటల్ ప్రిమియర్ హక్కును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

జీ5 సంస్థ గుడ్ న్యూస్...

మరి జీ 5 సంస్థ ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ను ప్రకటించలేదు. త్వరలోనే అంటూ ఊరిస్తూ వస్తుంది. ఇక నెటిజన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ ను పంచుకుంది. అయితే ఈ సినిమాను సౌత్ వెర్షన్ కి సంబంధించి ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా మిగతా భాషలు ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ వేసిన ప్రశ్న నెట్టింట వైరల్ గా మారింది.

Zee5 OTT Latest Update on Prashanth Varma HanuMan Telugu Version Release Full Details Here

మొదట తెలుగు వర్షన్...

హనుమాన్ చిత్రం ఈరోజు రాత్రి 8 గంటలకు తమిళ్ వర్షన్ రిలీజ్ అవుతుందా అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి మన తెలుగు వెర్షన్ లోనే అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా జీ5 రిప్లే ఇచ్చింది. హను మాన్ తెలుగులో అతి త్వరలో వస్తుందని... జీ5 కన్మార్మ్ చేసింది. దీనితో ఈ చిత్రం ఫస్ట్ తెలుగులో వచ్చి తర్వాత మిగతా భాషల్లో వస్తుందేమోనని అంటున్నారు. పూర్తి క్లారిటీ రావాలంటే కాస్త ఆగాల్సిందే.

Zee5 OTT Latest Update on Prashanth Varma HanuMan Telugu Version Release Full Details Here

హిందీ వర్షన్ స్ట్రీమింగ్...

ఇక ఈ సినిమా హిందీ వర్షన్ మాత్రం కలర్స్ సినీ ప్లెక్స్ టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం అయింది. అంతే కాదు.. జియో సినిమా ఓటీటీలోనూ శనివారం రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కనుక హిందీలోనూ చూడాలనుకుంటే జియో సినిమా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X