RRR on ZEE5: మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఎక్స్‌క్లూజివ్ వీడియో రిలీజ్

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్, స్టార్ కాస్టింగ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఆరంభంలోనే ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో బిజినెస్‌ను జరుపుకుని.. దాదాపు పది వేలకు పైగా థియేటర్లలో గత ఫిబ్రవరిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ అంచనాలకు అనుగుణంగానే ఆరంభంలోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఇది మంచి స్పందనను దక్కించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై పంజాను విసురుతూ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇలా కేవలం పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్లను పూర్తి చేసుకుంది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో ఆల్‌టైం ఇండస్ట్రీ రికార్డులను కూడా నమోదు చేసుకుంది. ఇలా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుంది.

ZEE5 Releases RRR Telugu Exclusive Trailer

దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేట్రికల్ హక్కులకు కాదు.. శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో చాలా రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే దీన్ని జీ5లో మే 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతోన్నారు.

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని మే 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జీ5 సంస్థ ఓ స్పెషల్ ట్రైలర్ వీడియోను విడుదల చేసింది. ఇందులో మూవీలోని హైలైట్ సీన్స్ అన్నింటినీ చూపించారు. అలాగే, కొన్ని డైలాగులను కూడా యాడ్ చేశారు. దీంతో ఈ ట్రైలర్‌కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇదిలా ఉండగా.. ఈరోజుతో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ యాభైవ రోజును జరుపుకుంటోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మెగా, నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్‌లు కట్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X