దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో త్రిష ఒకరు. తమిళనాడుకు చెందిన ఈమె.. క్రిమినల్ సైకాలజీలో పట్టా అందుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగెట్టింది. అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది.
దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో త్రిష ఒకరు. తమిళనాడుకు చెందిన ఈమె.. క్రిమినల్...
మోడలింగ్‌లో సత్తా చాటిన త్రిష.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పదహారేళ్ల వయసులోనే ‘జోడీ’ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత 2002లో సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పెసియాదే’ అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది.
మోడలింగ్‌లో సత్తా చాటిన త్రిష.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పదహారేళ్ల వయసులోనే...
ప్రభాస్‌తో చేసిన ‘వర్షం’, ఆ వెంటనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ కూడా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
ప్రభాస్‌తో చేసిన ‘వర్షం’, ఆ వెంటనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ కూడా భారీ విజయాన్ని...
టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే యంగ్ హీరోలతో పాటు చిరు, బాలయ్య, నాగ్, వెంకీతోనూ ఆడిపాడింది. దీంతో రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా రికార్డులకెక్కింది.
టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే యంగ్ హీరోలతో పాటు చిరు, బాలయ్య, నాగ్,...
2015లో తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది.
2015లో తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైన విషయం తెలిసిందే....
సాధారణంగా హీరోయిన్లపై ఎన్నో రూమర్లు ప్రచారం అవుతుంటాయి. అలాగే, త్రిష సినీ కెరీర్‌లో చాలా మంది హీరోలతో ఆమెకు ముడిపెడుతూ పుకార్లు షికార్లు చేశాయి. మొదట ఆమె ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరిగింది.
సాధారణంగా హీరోయిన్లపై ఎన్నో రూమర్లు ప్రచారం అవుతుంటాయి. అలాగే, త్రిష సినీ కెరీర్‌లో చాలా మంది...