twitter
    bredcrumb

    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్

    By Rajababu A
    | Published: Friday, March 25, 2022, 19:24 [IST]
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    1/15
    హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచే మనం ఆ పోరాటాన్ని మొదలుపెడదాం. అది ఒక రోజు దేశం మొత్తం విస్తరించాలి.. నేతాజీ అస్తికలు భారతదేశంలోకి రావాలి.. మనం ఆయనకు సెల్యూట్ చేయాలన్నారు. అందుకోసం బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్ లు రూపొందించారు. 
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    2/15
    నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తులకు కిరీటాలు, స్మారక భవనాలు నిర్మిస్తాం. దేశం కోసం ఇంత యుద్ధం చేసిన వ్యక్తిని గౌరవించుకోకపోతే అంతకు మించిన అవమానం ఏముంటుంది. మనలో చలనం ఏ స్థాయిలో చచ్చిపోయిందో.. ఉదాసీన భావనతో మనం ఏ స్థాయిలో కొట్టుకుపోతున్నామో అర్ధం అవుతోంది. నా కోరిక ఒకటే ఏ కష్టం కోసం ఇన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేశారో వారి కోసం నిలబడదాం. 
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    3/15
    మన నేతాజీ కోసం నిలబడమని అడుగుతున్నా. ఆయన ఆస్తికలు రావాలని మనసు పెట్టండి. పూజా మందిరంలో, గదుల్లో, మసీదుల్లో, హిందూ మందిరాల్లో ఒకటే కోరిక పెడదాం నేతాజీ అస్తికలు భారత్ కు రావాలని కోరుకుందాం. అదే ఈ సభ ఉద్దేశం.
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    4/15
    శాస్త్రి గారు తన రచ్చనతో ఉదాసీనత నిండిన భారత జాతి మీద బాణం విసిరారు. దాన్ని పట్టుకుని నేతాజీ అస్తికలు తెప్పించేందుకు మా వంతు కృషి చేస్తాం. ఏ దేశమైతే అన్నం పెట్టిందో, ఏ దేశం నీడ నిచ్చిందో దానికి శాల్యూట్ చేస్తూ.. జైహింద్” అని పవన్ కల్యాణ్ అన్నారు.
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    5/15
    నేతాజీ అస్తికలు దేశంలోకి రావాలి. కనీసం 100 రూపాయిల నోటు మీద నేతాజీ బొమ్మ పడాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేద్దాం. ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ కి రెండేళ్ల ముందు విదేశాల్లో మన మువ్వన్నెల జెండా ఎగిరింది. జనగణమణకు మొదటి వెర్షన్ జైహింద్ నినాదం ఇచ్చింది సుభాష్ చంద్ర బోస్ గారే. అలాంటి మహానుభావుడికి ఏదో ఒకటి చేయాలన్న కోరిక నన్ను ఇక్కడి వరకు తెస్తే మీరంతా ఇంకా ఎంతో చేయొచ్చు అని పవన్ కల్యాణ్ అన్నారు. 
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    6/15
    నేతాజీ గ్రంధ రచయిత  శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారు మాట్లాడుతూ “ప్రజలు పత్రికలు, పుస్తకాలు చదవడం మానేశారు. ఎంత గొప్పగా రాసినా దానిని ప్రజలకు ఎవరు అందిస్తారనే నిరాశకు ఈ మధ్య కాలంలో లోనయ్యాను. పుస్తకాలు రాయడం మానేస్తే మంచిదనే అభిప్రాయానికి కూడా వచ్చాను. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ప్రతి ఒక్క రచియిత బాధ, ఆవేదన. గ్రంధావిష్కరణ సభ పెడితే 10 మంది వస్తే ఎక్కువ. పుస్తకం రాసి, అచ్చువేయించి ఫ్రీగా ఇస్తామన్నా చదివేవాడు లేడు. ఇటువంటి సమయంలో ఒక పుస్తకాన్ని ఎంచుకొని, దానిని సమీక్ష కోసం విలువైన సమయాన్ని వెచ్చించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. తెలుగు సాహితీలోకానికి ఆయన మహోపకారం చేశారు. 
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    7/15
    ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ వై.యస్.ఆర్.శర్మ గారు మాట్లాడుతూ “నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రపై రకరకాల వక్రీకరణలు సృష్టించారు. ఆ వక్రీకరణలను సక్రీకరణలు చేయడానికే శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో ఈ 380 పేజీలు బృహత్ చరిత్రను చెబుతాయి. మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్రలో మిస్ అయినా పేజీలన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. బోస్ జీవిత చరిత్ర ఎంత చదివినప్పటికీ ఎంతో కొంత మిగిలి ఉన్నది అనేది భావన ఈ పుస్తకం తీర్చింది. ప్రజాదరణ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని సమీక్షకు పెట్టడం రచయితకు ఉపకరిస్తుంది. సుబాష్ చంద్రబోస్ అంటే ఉద్వేగం అని రయియిత రాశారు. పవన్ కళ్యాణ్ గారిలో కూడా అలాంటి ఉద్వేగం  ఉండబట్టే  ఈ పుస్తకాన్ని ఆయన ఓన్ చేసుకున్నారు” అన్నారు
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    8/15
    భగవద్గీతా ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ ఎల్. వి. గంగాధర శాస్ర్తీ గారు మాట్లాడుతూ... “బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఎవడైనా బతుకుతాడు. కట్టే కాలిన తరువాత కూడా ఎవడైతే ప్రజల గుండెల్లో బతుకుతారో వారిదే నిజమైన జీవితం. నేతాజీది కూడా నిజమైన జీవితం. నేతాజీ జీవిత చరిత్ర చదివినా, భగవద్గీత చదివినా వాటికి ఫ్యాన్సు ఉండరు, ఫాలోయర్సు మాత్రమే ఉంటారు అని ఎల్.వి.గంగాధర శాస్త్రి అన్నారు. 
    #renkojitoredfort నేతాజీ అస్థికలు భారత్‌కు ఎందుకు తీసుకురారు.. ప్రశ్నించిన పవన్ కల్యాణ్
    9/15
     మన సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలకు ఒక మేధావిగా, సీనియర్ జర్నలిస్టుగా, సోషల్ డాక్టర్ గా శాస్త్రి గారు రాస్తున్న పుస్తకాలు దివ్యా ఔషదాల్లాంటివి. ఆయన వాదనలో కొన్ని వాక్యాలు చాలా మందికి రుచించకపోయినా.. అందులో సత్యం తాలూకు శక్తి మాత్రం వెంటాడుతుంది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X