దుష్టులను శిక్షించేందుకే వరాహి.. నాకు పునర్జన్మను ప్రసాదించింది అంజన్న.. పవన్ కల్యాణ్
By Rajababu A
| Published: Tuesday, January 24, 2023, 16:20 [IST]
1/20
దుష్టులను శిక్షించేందుకే వరాహి.. నాకు పునర్జన్మను ప్రసాదించింది అంజన్న.. పవన్ కల్యాణ్ | Pawan Kalyan's Puja for Varaahi vehicle at Kondagattu Anjaneya Swamy Temple - FilmiBeat Telugu/photos/feature/pawan-kalyan-s-puja-for-varaahi-vehicle-kondagattu-anjaneya-swamy-temple-fb86551.html
వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్ధం అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు అనంతరం వాహనంపై నుంచి మాట్లాడారు.
వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్ధం అని జనసేన పార్టీ అధ్యక్షులు...
కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మనిచ్చారు. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. కానీ నన్ను అంజన్న, ఈ నేల తల్లి కాపాడారు. అందుకే ఏ ముఖ్య కార్యక్రమం ప్రారంభించినా కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తాను. ఇక్కడ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. నరసింహస్వామిగా, ఆంజనేయస్వామిగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకం.
కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మనిచ్చారు. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు హై వోల్టేజ్...
జనసేన పార్టీ సామాన్యుడి కోసం పని చేసే పార్టీ. తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాడుతుంద"ని అన్నారు. విజయాల వారాహి వైభవంగా సిద్ధం అయ్యింది. దుష్టులను శిక్షించే దుర్గాదేవి అంశ వారాహి మాత పేరుతో జనసేన ప్రచార రథం పరుగులు తీసేందుకుగాను సంప్రదాయబద్ధమైన పూజలు నిర్వహించారు. విజయ తీరాల వైపు ప్రయాణించేందుకు దూసుకువస్తోంది.
జనసేన పార్టీ సామాన్యుడి కోసం పని చేసే పార్టీ. తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన...
ఎల్లవేళలా అభయమిచ్చే శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో తొలి ప్రసంగం చేసి, వాహనాన్ని లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు.
ఎల్లవేళలా అభయమిచ్చే శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి జనసేన...
వారాహి వాహనం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ప్రారంభించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గం ద్వారా మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సభక్తికంగా అర్చనలు చేశారు.
వారాహి వాహనం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ప్రారంభించేందుకు జనసేన అధ్యక్షులు...
మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతి పాత్రమైన తమలపాకులు పూజ ఆలయ అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చేయించారు. స్వామివారికి పూలు, పళ్ళు సమర్పించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు ఆలయ ఆవరణలో గడిపారు. సంప్రదాయ వస్త్రధారణ, నుదుట సింధూరం ధరించి పూర్తి భక్తిప్రపత్తులతో పూజల్లో పాల్గొన్నారు.
మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతి పాత్రమైన తమలపాకులు పూజ ఆలయ అర్చకులు శ్రీ పవన్...