Pawan Kalyan అపజయంతో కుంగిపోవద్దు.. గబ్బర్ సింగ్ తర్వాతే నా జీవితంలో విజయం
By Rajababu A
| Published: Saturday, December 3, 2022, 22:17 [IST]
1/13
Pawan Kalyan అపజయంతో కుంగిపోవద్దు.. గబ్బర్ సింగ్ తర్వాతే నా జీవితంలో విజయం | Pawan Kalyan speech at Institute of Chartered Accounts of India conference in Hyderabad - FilmiBeat Telugu/photos/feature/pawan-kalyan-speech-institute-of-chartered-accounts-of-india-conference-in-hyderabad-fb85388.html
హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ నిర్వహించారు. శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో...
Pawan Kalyan about Gabbar Singh movie success/photos/feature/pawan-kalyan-speech-institute-of-chartered-accounts-of-india-conference-in-hyderabad-fb85388.html#photos-1
నేను ఎల్లప్పుడూ ఆదాయం సమకూర్చుకొనే జీవితాన్ని కోరుకోను... అనుభూతితో కూడిన జీవితాన్నే కోరుకుంటాను... నేను డబ్బు కోసం అర్రులు చాచను. నన్ను ఎవరైనా విజయం సాధించే మనిషిగా ఉంటావా..? లేదా విలువలు కాపాడే వ్యక్తిగా జీవిస్తావా అంటే రెండూ కోరుకొంటా అనే చెబుతాను.
నేను ఎల్లప్పుడూ ఆదాయం సమకూర్చుకొనే జీవితాన్ని కోరుకోను... అనుభూతితో కూడిన జీవితాన్నే...
Pawan Kalyan about Gabbar Singh movie success/photos/feature/pawan-kalyan-speech-institute-of-chartered-accounts-of-india-conference-in-hyderabad-fb85388.html#photos-2
స్వామీ వివేకానంద, భగత్ సింగ్ లాంటి వారిని రియల్ హీరోలుగా భావిస్తాను. నేను ఎక్కువ అభిమానించే వ్యక్తుల్లో వనజీవి రామయ్య.. ఎవరికోసమో ఎదురుచూడకుండా లక్షల మొక్కలను నాటి పర్యావరణాన్ని, మన భూమిని కాపాడేందుకు నిరంతరం కృషి చేశారు. అలాగే ఒకే వ్యక్తి.. కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ ముంపుకు గురయ్యినప్పుడు వందల మంది ప్రాణాలను కాపాడారు. ఇలాంటి వ్యక్తులే నాకు రియల్ హీరోలు.
స్వామీ వివేకానంద, భగత్ సింగ్ లాంటి వారిని రియల్ హీరోలుగా భావిస్తాను. నేను ఎక్కువ...
Pawan Kalyan about Gabbar Singh movie success/photos/feature/pawan-kalyan-speech-institute-of-chartered-accounts-of-india-conference-in-hyderabad-fb85388.html#photos-3
నేటి యువతకు బలమైన ఆలోచనలతోపాటు బలమైన దేహధారుఢ్యం కూడా అవసరమే.. స్వామీ వివేకానంద చెప్పినట్టు... వంద మంది బలమైన యువకులు ఉంటే మార్పు తీసుకురావడం తేలికే.. నేటి యువతరానికి విద్యతోపాటు కండబలం కూడా అవసరమే.. అందుకు మార్షల్ అర్ట్స్ లో శిక్షణ పొందవచ్చు. ఇదేదో పక్కవాణ్ని కొట్టడానికి కాదు.. మన బలాన్ని... భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కోసం ఇవి అవసరం.
నేటి యువతకు బలమైన ఆలోచనలతోపాటు బలమైన దేహధారుఢ్యం కూడా అవసరమే.. స్వామీ వివేకానంద చెప్పినట్టు......
Pawan Kalyan about Gabbar Singh movie success/photos/feature/pawan-kalyan-speech-institute-of-chartered-accounts-of-india-conference-in-hyderabad-fb85388.html#photos-4
నేను రాజకీయాల్లోకి రాక ముందు కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించాను. కానీ మార్పు ఒక్క రోజులో రాదని తెలుసుకోవాలి. ప్రజలలో మార్పు తీసుకురావడం అంత సులభం కాదు. చాలామంది జనాలకు తక్షణ విజయాలు కావాలి.. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడీల్స్ మాదిరి. మార్పు సాధించాలంటే ఓపిక, సహనం ఉండాలి. ఇది సాధించాలంటే దశాబ్దాలు పట్టవచ్చు. ప్రస్తుతం నా మిషన్ యువతను శక్తివంతులుగా తీర్చిదిద్దటమే. రాజకీయ వ్యవస్థను తిట్టుకుంటూ గడిపే బదులు, దీన్ని మార్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయడం అవసరం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
నేను రాజకీయాల్లోకి రాక ముందు కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించాను. కానీ...
Pawan Kalyan about Gabbar Singh movie success/photos/feature/pawan-kalyan-speech-institute-of-chartered-accounts-of-india-conference-in-hyderabad-fb85388.html#photos-5
అపజయాలను, విజయాలను సమానంగా స్వీకరించాలి. నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తాను. కానీ.. ఎప్పటికీ నేను ఓడిపోయినట్టుగా భావించలేదు. ఒక అపజయంకూడా సగం విజయం అనే భావన నింపుకున్నాను. నేను కనీసం ప్రయత్నం చేశానని అనుకొంటాను. మీ అందరికీ నా విన్నపం ఒక్కటే... అపజయం ఎదురైనా ఎన్నడూ చింతించవద్దు... అలానే ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అని పవన్ కల్యాణ్ అన్నారు.
అపజయాలను, విజయాలను సమానంగా స్వీకరించాలి. నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తాను....