bredcrumb

శుక్రవారం వస్తే బంగారమే.. పుత్తడి బొమ్మగా మారిపోయిన ప్రియాంక మోహన్

By Siva Kodati
| Published: Saturday, November 8, 2025, 20:28 [IST]

స్టార్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా చీరలో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.

priyanka Mohan Photos
1/5

తన కెరీర్‌లోనే తొలిసారిగా పవన్ కళ్యాణ్ వంటి సూపర్‌స్టార్‌తో నటించడంతో పొంగిపోతున్నారు కన్నడ కస్తూరి ప్రియాంక మోహన్. సుజిత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వచ్చిన ఓజీలో పవర్‌స్టార్ సరసన ప్రియాంక హీరోయిన్‌గా నటించారు. 

priyanka Mohan Photos
2/5

ఓజీలో కన్మణి పాత్రలో అద్భుతంగా నటించారు ప్రియాంక. చీరకట్టులో పద్ధతిగా అందాల విందు చేశారు. ఈ పాత్ర కోసం తాను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ఓజీ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు.

priyanka Mohan Photos
3/5

ఓజీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రియాంక మోహన్‌కు అవకాశాలు క్యూకడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ముద్దుగుమ్మ.. తమిళంలో కవిన్ 9లో నటిస్తున్నారు. ఇవికాక మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఏది పడితే అది చేయకుండా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు ప్రియాంక.

priyanka Mohan Photos
4/5

మొన్నామధ్య కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో పెళ్లి బట్టల్లో ఉన్న ప్రియాంక మోహన్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పుకార్లు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. 

priyanka Mohan Photos
5/5

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. శుక్రవారం వస్తే తాను బంగారం ధరిస్తానంటూ ఆమె రాసుకొచ్చారు 

X