twitter
    bredcrumb

    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు

    By Pichuka Manoj Kumar
    | Published: Monday, October 17, 2022, 15:20 [IST]
    Tollywood actress and a former model Sonal Chauhan Full Active In Social Media. Now She Shared a Hot Photos in her Instagram. టాలీవుడ్ హీరోయిన్, మాజీ మోడల్ సోనాల్ చౌహాన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అయిపోతోంది.
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    1/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోనాల్ చౌహాన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. దీంతో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది.
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    2/10
    టాలీవుడ్‌లో ఇప్పుడు పదుల సంఖ్యలోనే పేరున్న హీరోయిన్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రం ఇప్పటికి కూడా సరైన ఆఫర్లను అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ సినిమాలో నటించినా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నారు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ ఒకరు. 
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    3/10
    సోనాల్ చౌహాన్ మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే ఎన్నో అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి.
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    4/10
    మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అవడంతో సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె ముందుకు రాలేదు. అయితే, ఆ తర్వాత ‘జన్నత్’ అనే హిందీ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయం అయింది.
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    5/10
    హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు చాలా భాషల నుంచి సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ‘రెయిన్‌బో’ అనే చిత్రం ద్వారా తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ‘రూలర్’, ‘F3’ వంటి సినిమాలు చేసింది.
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    6/10
    అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా సోనాల్ చౌహాన్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె సీనియర్ హీరోలతో కూడా నటించడానికి ముందుకు వచ్చింది. తద్వారా వాళ్లకు ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. 
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    7/10
    సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    8/10
    సుదీర్ఘ కాలంగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. 
    Sonal Chauhan: సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    9/10
    సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్ట్రాప్‌లెస్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X