twitter
    bredcrumb

    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, November 5, 2022, 16:13 [IST]
    Bollywood actress and Virat Kohli Wife Anushka Sharma Very Busy in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    1/10
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    2/10
    సినీ రంగానికి, క్రికెట్‌కు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో ఈ రెండు రంగాలకు చెందిన వారికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే సినిమా రంగానికి చెందిన బ్యూటీలనే క్రికెటర్లు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    3/10
    చాలా తక్కువ మంది మాత్రమే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట ఒకటి. ఆ మధ్య ఒక్కటైన ఈ జంట.. ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    4/10
    తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది అనుష్క శర్మ. అదే సమయంలో కోహ్లీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ వ్యాపార ప్రకటనలో నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడిపోయారు. 
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    5/10
    వరుస సినిమాలతో అనుష్క శర్మ... బిజీ షెడ్యూల్‌తో విరాట్ కోహ్లీ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. అయినప్పటికీ.. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తమ కెరీర్లకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలనూ పంచుకుంటున్నారు. 
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    6/10
    ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడన్న విషయం తెలిసిందే. తన సక్సెస్‌కు అనుష్క శర్మ ప్రోత్సాహం కూడా కారణమని అతడు ఎన్నోసార్లు వెల్లడించాడు. అయితే, విరాట్ ఫెయిల్యూర్ అయన సందర్భాల్లో మాత్రం చాలా మంది అనుష్కనే విమర్శించారు.
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    7/10
    కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌‌ను కంటిన్యూ చేసింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు ‘వామికా’ అని నామకరణం చేశారు.
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    8/10
    విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం తర్వాత తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తరచూ వీళ్లిద్దరూ పర్సనల్ టూర్లతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
    HBD Kohli: కోహ్లీతో రొమాంటిక్‌గా అనుష్క శర్మ.. అసలు వీళ్లు ఎలా కలిశారో తెలుసా!
    9/10
    టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కోహ్లీ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X