twitter
    bredcrumb

    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్

    By Rajababu A
    | Published: Tuesday, July 19, 2022, 09:44 [IST]
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    1/8
    మల్లారెడ్డి ఉమెన్ కాలేజ్‌లో కానున్న కల్యాణం పాటను రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. 
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    2/8
    దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. కానున్న కళ్యాణం లాంటి అందమైన పాట చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. కాశ్మీర్ మంచు, ట్రెడిషనల్ దుస్తులలో చాలా అందంగా చిత్రీకరించాం. మోస్ట్ రొమాంటిక్, విజువల్ వండర్ లాంటి సాంగ్ ఇది. ఇది నా ఫేవరేట్ సాంగ్. ఈ పాటని మీ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. ఇంతమంది విద్యార్ధులని ఒక్క చోట చూడటం ఇదే మొదటిసారి. ఆగస్ట్ 5న అందరం థియేటర్ లో కలుద్దాం అని అన్నారు
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    3/8
    స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న సీతారామంకు  విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    4/8
    ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న  కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    5/8
    ♪♪కానున్న కళ్యాణం ఏమన్నది? 
    స్వయంవరం మనోహరం 
    రానున్న వైభోగం ఎటువంటిది ? 
    ప్రతి క్షణం మరో వరం 
    విడువని ముడి ఇది కదా 
    ముగింపు లేని గాధగా 
    తరముల పాటుగా తరగని పాటగా 
    ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.. ♪♪

    పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి. అద్భుతమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల్ మ్యాజికల్ గా కనిపిస్తుంది. 
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    6/8
    కానున్న కళ్యాణం ఏమన్నది పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా ఉంది 
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    7/8
    విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని థర్డ్ సింగల్ కానున్న కళ్యాణం అనే పాటని హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, తరుణ్ భాస్కర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్. మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది. 
    Sita Ramam కానున్న కళ్యాణం పాట రిలీజ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అదిరిపోయే డ్యాన్స్
    8/8
    దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం సీతా రామం. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X