వైఎస్ జగన్‌పై బ్రహ్మజీ వివాదాస్పద ట్వీట్.. 1000 కోట్లపై క్లారిటీ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి సినిమా వరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక పాత్రలు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఏదో ఒక రకంగా రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు సినీ ప్రముఖులకు రాజకీయ నాయకులకి అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తే.. ఇక్క డోస్ ఒకింత ఎక్కువే అని చెప్పాలి.
కాగా ఇక్కడ తెలుగు సినిమా స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడంతో సినిమా వారికి పాలిటిక్స్ మరింత చేరువయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో గత ప్రభుత్వంకి ఉన్న వివాదాల కోసం అందరికీ తెలిసిందే. దీనితో అక్కడ నుంచి పరిస్థితులు మరింత గరం గరంగా మారడంతో ఓ రేంజ్ లో అంతా ఒక్కసారిగా మారిపోయింది.

ఇక ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గెలవడం చాలా మంది పవన్ కళ్యాణ్ కి సినిమా నుంచి సపోర్ట్ గా మారడం కూడా జరిగింది. అయితే వై ఎస్ జగన్ విషయంలో రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ చేసిన ఓ పోస్ట్ వివాదాలకు దారి తీసింది. వై ఎస్ జగన్ ప్రస్తుత ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన పోస్ట్ కి బ్రహ్మాజీ ఒక షాకింగ్ రిప్లై ఇచ్చారు.
"మీరు కరెక్ట్ సార్ వాళ్ళు చెయ్యలేరు, మనం చేద్దాం సార్. ఫస్ట్ మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేద్దాం సార్, మన వైఎస్సార్సీపీ క్యాడర్ ని మొత్తం దింపుదాం. మనకి గవర్నమెంట్ ముఖ్యం కాదు కాదు జనమే ముఖ్యం. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్న" అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఒకటి ఇపుడు వైసీపీ ఫ్యాన్స్ లో వివాదాలకు దారి తీసింది. దీనితో జగన్ శ్రేణులు బ్రహ్మాజీపై ఆగ్రహం చేస్తుండగా.. దీనిపై బ్రహ్మాజీ నెక్స్ట్ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని ఆ ట్వీట్ కి నాకు సంబంధం లేదు. కంప్లైంట్ చేసాం అంటూ మరి పోస్ట్ చేశారు. దీనితో జగన్ అభిమానులకి మరో ట్విస్ట్ ఎదురైంది అని చెప్పాలి. కాగా బ్రహ్మాజీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటారు. చాల సార్లు కొన్ని వెటకారపు పోస్ట్ లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా మాజీ సీఎం పై చేసిన సందర్భాలు అయితే లేవు.

మరి అది నిజంగానే తాను చేసారా లేక నిజంగానే తన ఖాతా హ్యాక్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు బ్రహ్మాజీ పట్ల కొంచెం గుస్సా గానే ఉన్నారు. ఇక బ్రహ్మాజీ అయితే తెలుగు సినిమాలో పలు సినిమాల్లో బిజీగా ఉండగా పుష్ప 2, సలార్ 2 లాంటి భారీ చిత్రాల్లో కూడా తాను కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే తాను నటించిన తెలుగు క్లాసిక్ హిట్ "ఖడ్గం" చిత్రం ఈ అక్టోబర్ 2 గాంధీ కానుకగా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











