Tirumala Laddu Row: జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డు.. ఘోరాతి ఘోరం’: మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..

Tirumala Laddu row: పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ మహా ప్రసాదం (Tirupati laddu)తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీపై చర్చ జరుగుతోంది. దేశంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతకు భంగం కల్గించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సినీనటుడు మోహన్ బాబు స్పందిస్తూ.. తనదైన శైలితో సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత నాలుగైదు రోజులుగా తిరుపతి లడ్డూ వివాదం చర్చనీయంగా మారింది. లడ్డూ తయారీలో నెయ్యిలో జంతువుల కొవ్వును కలుపుతున్నారనీ స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీ తిరుపతి తిరుమల వారి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మరోవైపు.. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది.

Actor film producer Mohan Babu shocking comment on Tirumala Laddu row

ఈ వివాదంపై పలువురు ప్రముఖులు, అధ్యాత్మిక వేత్తలు, తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఈ తాజాగా ఈ వివాదంపై సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని మోహన్ బాబు కీర్తించారు. అలాంటి దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు.నిత్యం తన మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని అన్నారు.

ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని తన ఆత్మీయుడు, మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తన మిత్రుడు అందుకుని సూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని నటుడు మెహన్ బాబు పేర్కొన్నారు.

Actor film producer Mohan Babu shocking comment on Tirumala Laddu row

అంతకు ముందు.. తిరుపతి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్.. మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై దయచేసి విచారణ జరపండి. ఈ వివాదానికి కారణమైన దోషులను కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. కానీ, ఆ విషయాన్ని పక్కన పెట్టి.. ఈ సమస్యను దేశ వ్యాప్తం చేస్తూ.. ఎందుకు ఆందోళనలు వ్యాపించేలా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ పోస్ట్‌కు టాలీవుడ్ నటుడు మంచు విష్ణు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చారు. ఈ విషయంలో ప్రకాశ్‌ రాజ్ గారు హద్దుల్లో మీరు ఉండండి అంటూ.. 'శ్రీ ప్రకాశ్‌రాజ్‌ గారు.. మీరు దయచేసి కాస్త తగ్గండి. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సరిగ్గానే పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారుంటే..మతపరమైన రంగు ఎక్కడ పులుముకుంటుందో?. #మీ పరిధుల్లో మీరు ఉండండి' అంటూ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చారు మంచు విష్ణు.

More from Filmibeat

Read more about: mohan babu chandrababu naidu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X