వైసీపీ పూర్తిగా చావలేదు.. ఇంకా కోరల నిండా విషమే.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో కూటమి గెలుపొందగా.. అధికార వైసీపీ 11 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్దానాలకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. చంద్రబాబు - పవన్‌లు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంలోనూ కీలకపాత్ర పోషించారు. బుధవారం గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లి వద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినట్లయ్యింది. వారిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

శాఖల కేటాయింపు విషయంలోనూ ఉత్కంఠకు తెరదించుతూ జనసేన అధినేతకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, శాస్త్ర, సాంకేతిక శాఖలను కేటాయించారు చంద్రబాబు . తొలుత హోంశాఖను అప్పగిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ పవన్ కోరిక మేరకు శాఖలను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రతిపక్షనేతగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాన్ ఇకపై అధికారపక్షంలో, డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో ఆయన పాలనలో ఎలాంటి ముద్ర వేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Actor nagababu fire on YSRCP for fake news against tdp bjp janasena alliance

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి పట్టుమని వారం రోజులు కూడా గడవకముందే సోషల్ మీడియా, కొన్ని వెబ్‌సైట్స్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. పవన్ - చంద్రబాబుల మధ్య మనస్పర్ధలు వచ్చాయని .. శాఖల కేటాయింపు పవన్‌కు నచ్చలేదని.. కోరినన్ని మంత్రి పదవులు తమకు కేటాయించలేదని జనసేనాని గుర్రుగా ఉన్నారని.. తమకు సరైన ప్రాతినిథ్యం దక్కలేదని బీజేపీ నేతలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రకరకాలుగా విష ప్రచారం మొదలైంది.

రాజకీయ విశ్లేషకులు ఈ తీరును ఖండిస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి కుదురుకోవడానికి కాస్తయినా సమయం ఇవ్వాలని అప్పుడే విమర్శలొద్దని హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ ప్రొపగాండ ఆగడం లేదు. ఈ నేపథ్యంలో విషయం పవన్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వరకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగానే తన సోదరుల జోలికి , తమ సన్నిహితుల జోలికి వస్తే నాగబాబు అస్సలు సహించరు. వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే వరకు వదిలిపెట్టరు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారంపై సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.

Actor nagababu fire on YSRCP for fake news against tdp bjp janasena alliance

'' ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక.. మీడియాలో ప్రత్యేకించి సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యూలేషన్స్ ప్రచారమవుతున్నాయి. అది చెప్పడం కూడా నాకిష్టం లేదు. ఎవరైనా సరే, అలాంటి విషపు సర్క్యూలేషన్స్ గనుక ప్రచారంలోకి తీసుకొస్తే అది చాలా తప్పు. ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి స్పిరిట్‌కి తప్పుడు సంకేతం ఇస్తుంది. ఇలాంటివి ఎవరు చేసినా తగిన విధంగా బుద్ధి చెబుతాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ, పురంధేశ్వరిలు ఎంతో కష్టపడి తయారుచేసిన అద్భుతమైన కూటమి ''

'' టమి స్పిరిట్‌కు ఎఫెక్ట్ అయ్యేలా రాతలు రాస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి విషపు రాతల్ని కూటమి కార్యకర్తలు నమ్మొద్దు. ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైన కొంతమంది వ్యక్తులు. ఈ సోర్స్ ఏంటో మేం కనుగొంటాం. వైసిపి ఇంకా పూర్తిగా చావలేదు, ఇంక బతికే వుంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి..వాటినెవ్వరు పట్టించుకోకండి. కూటమికి‌ సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమిష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. స్ప్రెడ్ చేసిన ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం...జాగ్రత్త '' అంటూ నాగబాబు ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X