పాలిటిక్స్‌పై పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదు.. విజయ్‌ పార్టీపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌కు, ఇళయ దళపతి విజయ్‌కి రాజకీయాల మీద అవగాహన లేదని వ్యాఖ్యానించారు. అయితే వారికి అసలు సమస్యలు తెలియవు. రాజకీయాలు గురించి బొత్తిగా నాలెడ్జ్ లేదు. సిద్దాంతపరంగా ఎలాంటి స్పష్టత లేదనే విధంగా ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాలను వెల్లడించే ప్రయత్నం చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రశ్న అనే యూట్యూబ్ ఛానెల్ వీడియోలో ఆయన మాట్లాడిన హైలెట్ పాయింట్స్ విషయానికి వస్తే..

సినీ నటులు పవన్ కల్యాణ్, విజయ్ రాజకీయ రంగ ప్రవేశాలపై మాట్లాడుతూ.. ఎలాంటి అవగాహన లేకుండా రాజకీయ పార్టీలను నడుపుతున్నారు. పవన్ కల్యాణ్‌ 10 ఏళ్ల క్రితం పార్టీ పెడితే.. విజయ్ తమిళనాడులో ప్రస్తుతం పార్టీ పెట్టాడు. గత 10 ఏళ్లుగా వారితో నేను నటుడిగా ట్రావెల్ అయ్యాను. ఏనాడు పాలిటిక్స్ గురించి సీరియస్‌గా మాట్లాడినట్టు కనిపించలేదు. ఏనాడు నాతో రాజకీయాల గురించి వారి అభిప్రాయాలు చర్చించలేదు. అలాంటి వారు ప్రస్తుతం రాజకీయ పార్టీలు నడుపుతున్నారు అనే విధంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు.

Actor Prakash Raj criticises Pawan Kalyan

రాజకీయాల విషయానికి వస్తే.. ఒక పార్టీతో ఉంటాడు. మరొకరిని తిడుతాడు. సడెన్‌గా వెళ్లి ఏఐడీఎంకే, ఎంజీఆర్ గురించి మాట్లాడుతాడు. అలాగే పెరియార్ గురించి, ఇతర నేతల గురించి మాట్లాడుతాడు. పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు. పవన్ కల్యాణ్ అర్ధం చేసుకోరు. ఆయన మనకు అర్ధం కాదని కొందరు అంటారు. కానీ ఆయనకు ఏమీ తెలియదని నేనంటానని ప్రకాశ్ రాజ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురంలో జరిగిన కుల బహిష్కరణ సంఘటన గురించి మాట్లాడుతూ.. మహరాష్ట్ర పర్యటనలో అక్కడి సమస్యల గురించి మాట్లాడుతాడు. తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి సమస్యలు గురించి గొప్పగా మాట్లాడుతాడు. కానీ ఆ ప్రాంతంలో, పిఠాపురంలో ఉండే వాటి గురించి ఆయన ఆలోచించడు. పవన్ కల్యాణ్‌కు సమస్యల మీద అవగాహన లేదు అంటూ ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తే.. సోషల్ మీడియాలో నన్ను బూతులు తిడుతారు. గుడ్ మార్నింగ్ చెప్పినా వారికి బూతుగానే ఉంటుంది. జనసైనికులు ఎప్పుడూ బూతులతో రెడీగా ఉంటారు. గుడ్ మార్నింగ్‌లో ఏం బూతు ఉందో అర్ధం కాదు అంటూ ఆయన సెటైర్ వేశారు. ఇలా జనసేన అధినేతను ప్రతీ విషయంలో విమర్శించడం సోషల్ మీడియాలో చర్చానీయాంశమైంది.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్, విజయ్‌పై విమర్శలు చేసిన ప్రకాశ్ రాజ్‌పై నెటిజన్లు, అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రకాశ్ రాజ్‌కు వారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? బెంగళూరులో ఓడిపోయాడు. మా ఎన్నికల్లో ఓటమి చవి చూశాడు. రెండు చోట్ల ఓడిపోయిన ఆయన నీతులు చెప్పడం హస్యాస్పదంగా ఉంది. రాజకీయాలపై ఆయనకు ఎలాంటి అవగాహన ఉందో అందరికీ తెలుసు అని నెటిజన్లు మండిపడుతున్నారు.

More from Filmibeat

Read more about: prakash raj pawan kalyan vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X