ఎవరికేం అన్యాయం చేశాను, లైవ్‌లో ఏడ్చేసిన మాధవీలత

సినీనటి , బీజేపీ నేత మాధవీలత - టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తాను న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంపై విమర్శలు చేసిన మాధవీలతపై జేసీ విరుచుకుపడ్డారు. ఆమెను ప్రాస్టిట్యూట్ అని, బీజేపీ నేతలు హిజ్రాల కన్నా దారుణంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

2024 ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి వైసీపీపై పోరాటం చేసి విజయం సాధించాయి. నాటి నుంచి మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు ఆయా పార్టీల పెద్దలు. ఎక్కడైనా ఏదైనా మనస్పర్ధలు, విభేదాలు చోటు చేసుకున్న నేతలు రంగంలోకి దిగి పరిస్ధితిని చక్కదిద్దుతున్నారు. అలాంటి బీజేపీలోని మహిళా నేతపై టీడీపీలోని సీనియర్ నేత అసభ్యపదజాలంతో దూషించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే మాధవీలతకు సపోర్ట్‌గా బీజేపీలోని కొందరు నేతలు మాటల దాడికి దిగుతున్నారు.

actress and bjp leader madhavi latha Crying over recent issues video goes viral

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్క్‌లో మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి స్థానికంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దని.. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాధవీలత వ్యాఖ్యలపై మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మహిళలను కించపరిచేలా ఆమె మాటలు ఉన్నాయంటూ మండిపడ్డారు. జేసీ పార్క్‌లో ఎలాంటి దారుణ సంఘటనలు జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. మాధవీలత ప్రాస్టిట్యూట్, వేస్ట్ ఫెలో అంటూ జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాధవీలత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సినిమాల్లో నటించే మహిళలంతా వ్యభిచారులు కాదని.. ప్రభాకర్ రెడ్డి వయసుకు నేను గౌరవం ఇస్తానని , తాను ఎవరికీ భయపడనని ఆమె తేల్చి చెప్పారు. నన్ను చంపితే చంపుకోండి అంటూ మాధవీలత సవాల్ విసిరారు. స్క్రీన్‌పై కనిపించే ఆడవాళ్లు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అయితే తాడిపత్రిలో ఉండే పతివ్రతలు సినీ రంగంలోకి రావొద్దంటూ ఆమె సెటైర్లు వేశారు.

అన్ని వైపులా విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మాధవీలత గురించి తాను అలాంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. మాధవీలతకు క్షమాపణలు చెబుతున్నానని జేసీ తెలిపారు. అక్కడితో ఈ వివాదం సద్దుమణిగిపోయినట్లేనని బీజేపీ, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మాధవీలత మరోసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.

సోమవారం ఫేస్‌బుక్ పేజీలో వీడియో పెట్టిన ఆమె.. చాలా ప్రయత్నించానని , కానీ నేను కూడా మనిషినేనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోసార్లు, ఎందరో నా ఆత్మ విశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నించారంటూ కానీ మగాడిలా పోరాడుతున్నానని మాధవీ లత అన్నారు. నేను హిందూ ధర్మం, మహిళలు, పార్టీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పోరాడుతున్నానని తెలిపారు. ఎవరికీ ద్రోహం చేసింది కానీ, మోసం చేసింది కానీ లేదని అలాంటి నాపై కక్షగట్టి మాటలంటున్నారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. నా ధైర్యం కోల్పోనని.. నాకు అండగా నిలిచిన అందరికీ మాధవీలత ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించినదేనా? లేక మరొకటా అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం మాధవీలత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X