మేం వ్యభిచారులం .. నీవు ప్రతివతవా? జేసీ ప్రభాకర్‌రెడ్డికి హీరోయిన్ మాధవీలత స్ట్రాంగ్ వార్నింగ్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయనకు ఎవరిపై ముద్దొస్తుందో, ఎవరిని తిడతారో ఎవ్వరికీ తెలియదు. ఎవరు ఏమనుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, చేతలతో ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటారు. తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం రావడంతో జేసీ మరోసారి జోరు పెంచారు.
రాజకీయ నేతలు, ప్రత్యర్ధులపై విరుచుకుపడే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా సినీ రంగం, ఓ హీరోయిన్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం లేకపోలేదు.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాడిపత్రిలోని మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి స్థానికంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత మాధవీ లత స్పందించారు. జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దని.. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మాధవీలతపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తనదైనశైలిలో రెచ్చిపోయారు. మహిళలను అవమానించేలా మాధవీలత మాటలు ఉన్నాయని, జేసీ పార్క్‌లో ఎలాంటి దారుణ సంఘటనలు జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా మాధవీలత ప్రాస్టిట్యూట్ అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ వాళ్లు ఆమెను పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు, ఆమె వేస్ట్ ఫెలో అంటూ దుయ్యబట్టారు. తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పేముంది? అర్ఎస్ఎస్, బీజేపీ నేతలు హిజ్రాల కంటే దారుణంగా ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
ఇకపోతే.. అనంతపురం పట్టణంలో జేసీ కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపైనా ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరో కుట్ర చేసి తమ బస్సులు తగలబెడితే, పోలీసులు షార్ట్ సర్క్యూట్ అని కేసులు నమోదు చేశారని.. నేను ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేరస్తులను పట్టుకోవడం వారికి చేత కాదని, అందుకే వాళ్లపై తనకు నమ్మకం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో 300 బస్సులు పోతేనే తాను పట్టించుకోలేదని.. ఇప్పుడెందుకు బాధపడతానని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.
కాగా.. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత ఘాటుగా స్పందించారు. సినిమాల్లో నటించేవారంతా వ్యభిచారులు కాదని.. ప్రభాకర్ రెడ్డి వయసుకు నేను గౌరవం ఇస్తానని , అంతే తప్పించి తాను ఎవరికీ భయపడనని ఆమె తేల్చి చెప్పారు. నన్ను కిడ్నాప్ చేసి హత్య చేస్తారా? మహిళల గురించి మాట్లాడటం తప్పా? జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒళ్లంతా విష నాలుకలు ఉన్నాయంటూ మాధవీలత మండిపడ్డారు.
తండ్రి వ్యాఖ్యలను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఖండించాలని ఆమె కోరారు. స్క్రీన్‌పై కనిపించే ఆడవాళ్లు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అయితే తాడిపత్రిలో ఉండే పతివ్రతలు సినీ రంగంలోకి రావొద్దంటూ మాధవీలత సెటైర్లు వేశారు. తాడిపత్రిలోని మహిళలు మీ అందం, ఆలోచనలు, రూపం పెళ్లి తర్వాత మీ భర్తలకి సమర్పించుకోండి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. నా మీద 100 కేసులు పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చని, తనను చంపాలని అనుకుంటే చంపొచ్చని మాధవీలత తేల్చిచెప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











