పవన్ కల్యాణ్, నాగబాబుపై రోజా అనుచిత వ్యాఖ్యలు.. మార్క్ శంకర్‌‌ను వివాదంలోకి లాగి..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన గోశాలలో గోవుల మరణాలపై వివాదం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేత మధ్య సవాళ్లు వివాదంగా మారాయి. గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకొంటూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకొన్నారు. టీటీడీలో గోవుల మరణాలు లేవని.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా గోవుల మరణాలను చూపించాలని సవాల్ విసిరారు. దాంతో ఈ వివాదం ముదిరింది.

టీడీపీ విసిరిన సవాల్‌ను స్వీకరించి వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, రోజా ఇతర నేతలు గోశాల సందర్శనకు వెళ్లారు. సుమారు 100 కుపైగా గోవులు మరణించాయని ఆరోపిస్తూ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో భూమనను హౌస్ అరెస్ట్ చేశారు. రోజాను పోలీసులు అడ్డుకొన్నారు. దాంతో రోడ్డుపై పడుకొని నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్, నాగబాబు, చంద్రబాబుపై రోజా విరుచుకుపడ్డారు.

Actress Roja

తిరుమలలో గోవులు మరణిస్తున్నాయనే విషయంపై చర్చించడానికి రమ్మని సవాల్ విసిరితే మేము వచ్చాం. మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా పోలీసులను పెట్టి అడ్డుకొంటున్నారు. వారి అఫిషియల్ పేజ్‌లో పారిపోయారని ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే రమ్మను. ప్రూవ్ చేస్తాం. మేము డ్రామాలు ఆడుతున్నామని సిగ్గులేకుండా ఈ ఆడంగి వెధవలు కామెంట్స్ చేస్తున్నారు అని రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు చేస్తూ.. కూటమి ప్రభుత్వంలో నీవు పదవులు తీసుకొన్నావు. నీ అన్న నాగబాబుకు పదవి ఇప్పించావు కాబట్టి నీ నోరు పెగలడం లేదు. పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు. ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కల్యాణ్.. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పే వ్యక్తి. ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు. తప్పు చేసిన వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అని రోజా ఘాటుగా విమర్శలు చేశారు.

తిరుమల పవిత్రతపై మీకు చిత్త శుద్ధి లేదు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామితో పెట్టుకోంటే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. పవన్ కల్యాణ్ కూడా ఈ మధ్య కొంత రుచి చూశాడు. కాబట్టి దేవుడితో ఎప్పుడూ పెట్టుకోవద్దు అని రోజా కామెంట్స్ చేసింది. అయితే మార్క్ శంకర్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల పరంగా వ్యక్తిగత విమర్శలు సరే.. కానీ అభం శుభం పిల్లాడికి ప్రమాదం జరిగితే.. ఇటీవల పవన్ కల్యాణ్ రుచి చూశాడంటూ కామెంట్ చేయడం తగదు అని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గోవులను హిందువులు పవిత్రంగా భావిస్తారు. అలాంటి గోవులను పరిరక్షించడంలో పాలకమండలి విఫలమైంది. వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇన్ని అవులు మరణించి ఉంటాయో ఆలోచించాలి. మేము ఆందోళన చేస్తే.. వారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సవాల్ విసిరిన వాళ్లే మమ్ముల్ని అడ్డుకొంటున్నారు. వారు తప్పు చేయబట్టే వారు అడ్డుకొంటున్నారు అని ఆమె ఆరోపించారు.

More from Filmibeat

Read more about: roja pawan kalyan naga babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X