అజ్ఞాతం వీడిన సినీ నటి రోజా.. అలాంటి వీడియోతో పబ్లిక్‌లోకి!
ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి రోజా సెల్వమణి మీడియాలో హడావిడి తగ్గిపోయింది. నగరి నియోజకవర్గంలో దారుణ ఓటమి పాలైన తర్వాత ఆమె ఎవరికి అందుబాటులో లేకుండా పోయారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రోజా అజ్దాతం వీడి ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆమె తాజాగా పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యువతకు క్రీడా ప్రోత్సాహం అందించేందుకు 'అడుకుందాం ఆంధ్ర సీఎం కప్' పేరుతో మంత్రి రోజా అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.యువ క్రీడాకారులకు కిట్లు, క్రీడా సామాగ్రి అందించే స్కీమ్ అంతా అవినీతి మయంగా మారిందని ప్రస్తుతం నేతలు విమర్శలు భారీగా వచ్చాయి.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణ ఓటమి పాలైన తర్వాత ఎక్కువగా మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పించారు. శాప్, ఇతర క్రీడా సంఘాలే ఏకంగా మంత్రిపై ఏపీ సీఐడీ విభాగంలో ఫిర్యాదు చేశారు. 100 కోట్లకుపైగా దుర్వినయోగం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా జరిగిన క్రీడా వేడుకకు క్రీడాకారులు కాకుండా ఎక్కువ మంది జబర్దస్త్ ఆర్టిస్టులే రావడం మరో వివాదంగా మారింది. ఈ వేడుకలో ఆమె బంధువులతో కలిసి జల్సా చేసుకొంటూ వినోదాన్ని ఆస్వాదించారు. రోజా అధికారికంగా పాల్గొన్న కార్యక్రమానికి భారీగా ఖర్చు చేశారు. ఈ వేడుక కోసం సాప్ విభాగం నుంచి సుమారుగా 10 లక్షల రూపాయల వ్యయం అయింది. అంతేకాకుండా ప్రతీ రోజు భవానీ హైలాండ్ నుంచి మూడు పూటల భోజనం సప్లై చేశారు అనే ఆరోపణలు వచ్చాయి.
ఇలాంటి తన ఓటమి, ఇలాంటి ఆరోపణలు తర్వాత ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ వచ్చారు. సొంత పార్టీలో ఓడించారని విమర్శలు చేసిన ఆమె.. తన రాజకీయ ప్రత్యర్థుల దాడి తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లారనే కథనాలు మీడియాలో వచ్చాయి. అయితే ఇలాంటి ఊహాగానాలకు తెరవేస్తూ రోజా తాజాగా దర్శనమిచ్చారు.
మాజీ మంత్రి రోజా సెల్వమణి ఫ్లయిట్‌లో ప్రయాణం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. రోజంత ఉల్లాసంగా ఉండటానికి ఉదయం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉదయం నుంచి మంచిగా ప్రారంభమైతే.. ఆ రోజంతా బాగుంటుంది అని మెసేజ్ పెట్టారు. అంతేకాకుండా గుడ్ మార్నింగ్ అంటూ వీడియోలో ఉత్సాహంగా కనిపించారు. దాంతో నెటిజన్లు, ఆమె అభిమానులంతా ప్రజా జీవితంలోకి మళ్లీ వచ్చేసిందని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











