ఆడపిల్లకు ముద్దైనా పెట్టాలి? కడుపైనా చేయాలి? బాలకృష్ణను వివాదంలోకి లాగిన రోజా

ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు అరెస్ట్‌పై మాజీ మంత్రి, సినీ నటి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఆయన కంటే దారుణంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన బాలకృ‌ష్ణ, లోకేష్, చంద్రబాబు లాంటి నేతలు ముందుగా క్షమాపణలు చెప్పాలి. వారు చేస్తున్నట్టు భారతీ, జగన్ సారీ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యనించారు. కొమ్మినేని, ఇతర వివాదాస్పద అంశాలపై రోజా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను కూడా తప్పుపట్టారు. ఆమె తాను నిర్వహించిన మీడియా సమావేశంలో ఏం మాట్లాడారంటే?

అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్యాయాలు, ఘోరాలు మహిళలపై జరిగితే ఆయన నోరు విప్పడం లేదు. మహిళలపై దారుణాలకు పాల్పడిన వారిని శిక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడం లేదు. పిఠాపురం, అనంతపురం, తిరుపతి అయినా అన్యాయాలు జరిగితే మాట్లాడటం లేదు అని రోజా అన్నారు.

Actress Roja verbal attack on Nandamuri Balakrishna

50 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేసిన కొమ్మినేని శ్రీనివాసరావు అంటే అందరికి గౌరవం. అలాంటి వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి రిమాండ్‌కు పంపించడం అత్యంత దారుణం. ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకు వచ్చిన తీరును ప్రజలంతా గమనించారు అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసులో జర్నలిస్టును బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం?. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే.. చంద్రబాబు, లోకేష్ మాత్రమే చెప్పాలి అని అన్నారు.

కోడలు మగ బిడ్డ కంటే అత్త సంతోషించిందా? అంటూ ఆడ జాతి పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలా? లేదా కడుపైనా చేయాలి? అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అని వైసీపీ నేత, మాజీ మంత్రి, నటి రోజా సెల్వమణి డిమాండ్ చేశారు. ఇలాంటి కామెంట్లు చేస్తే వారిపై కేసులు పెట్టరా? అని ఆమె ప్రశ్నించారు.

Actress Roja verbal attack on Nandamuri Balakrishna

అలాగే తన కూతుళ్లను చూడటానికి జగన్ అన్న లండన్‌కు వెళ్తే దారుణంగా, నీచంగా కామెంట్స్ చేసిన నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి. ప్రముఖ ఛానెల్స్‌లో వైఎస్ భారతీ, వైఎస్ విజయమ్మ గురించి హోం మంత్రి అనిత ఎంత ఘోరంగా మాట్లాడారో అందరూ గమనించారు. అలాగే నన్ను, నా గురించి దారుణంగా తిట్టిన బండారు సత్యనారాయణను కూడా అందరూ చూశారు. అలాంటి ఆయనతో బూతులు తిట్టించిన చంద్రబాబు, లోకేష్‌లు క్షమాపణ చెప్పాలి అని రోజా మండిపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X