జనం కోసమే తపన : పవన్‌పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ఆ బాధను అలా భరించాడంటూ!
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన అందం, నటనతో ఒక ఊపారు శ్రీయా శరణ్. టాప్ స్టార్స్‌తో పాటు యంగ్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన శ్రీయ.. ఆపై సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇష్టం సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యారు. ఆ మూవీ నిరాశపరిచినా.. శ్రియా మాత్రం తన క్యూట్ లుక్స్, మెస్మరైజింగ్ స్మైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాంతో ఆమెకు టాప్ స్టార్స్ సరసన నటించే అవకాశం దక్కింది.
సంతోషంలో కింగ్ నాగార్జునతో, బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, చిరంజీవితో ఠాగూర్‌లో, వెంకటేష్‌తో సుభాష్ చంద్రబోస్, పవన్ కళ్యాణ్‌తో బాలు, మహేశ్‌తో అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌తో నా అల్లుడు, ప్రభాష్‌తో ఛత్రపతి సినిమాలలో నటించారు. అగ్ర నటులతో నటించిన హీరోయిన్స్ మిడ్ రేంజ్ హీరోలతో ఆడిపాడటం రిస్క్ అనే చెప్పాలి. కానీ శ్రియ మాత్రం .. స్టార్స్‌తోనే నటిస్తానని మడికట్టుకుని కూర్చోలేదు. కథ బాగుంటే చాలు.. హీరో ఎవ్వరనేది ఆలోచించలేదు. తరుణ్, రాజా, ఉదయ్ కిరణ్, వేణు వంటి హీరోలతోనూ నటించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో కొత్త నటుడు కౌశిక్‌కు ప్రేయసిగా నటించారంటే ఆమె గట్స్‌ను అర్ధం చేసుకోవచ్చు.

హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఉన్నప్పుడే .. ఐటెం సాంగ్స్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు శ్రీయా శరణ్. తన డ్యాన్సింగ్ స్కిల్స్, చురకత్తుల్లాంటి చూపులతో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసి మాస్‌ను ఒక ఊపు ఊపారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్ చిల్డ్రన్ వంటి ఇంగ్లీష్ చిత్రాల్లోనూ ఆమె సత్తా చాటారు. 2018 మార్చి 12న రష్యాకు చెందిన ఆండ్రే కొశ్చీవ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రియా. ఈ దంపతులకు ఒక పాప. 40 ప్లస్‌లో తన ఫిగర్‌ను మెయింటైన్ చేస్తూ గ్లామర్‌గా కనిపిస్తున్నారామె. సినిమాలు, యాడ్స్‌తో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను, ఆయన వ్యక్తిత్వాన్ని శ్రియా ఎంతో ఇష్టపడతారు. పలు వేదికలపై పవన్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రియ మరోసారి జనసేనానిపై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్‌గా ఉంటారని, కష్టపడతారని.. బాలూ సినిమాలో ఓ పాట షూట్ చేస్తున్నప్పుడు ఆయన కాలికి గాయమైందని.. అయినప్పటికీ షూటింగ్ ముగిసేవరకు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని శ్రియ తెలిపారు.

ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలని తాపత్రయపడతారని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం సంతోషంగా ఉందని.. పవన్ అద్భుతాలు సృష్టిస్తారని శ్రియ ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవితో మరోసారి పనిచేయాలని ఉందని తన మనసు మాటను బయటపెట్టారు . ప్రస్తుతం శ్రీయా శరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











