జగనన్న.. నీ పరిస్ధితి చూస్తే.. శ్రీరెడ్డి వీడియో వైరల్
కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన కొత్తలో ఫుల్ ఫేమస్ అయ్యింది శ్రీరెడ్డి. సినీ ప్రముఖులు తనకు అవకాశాలు ఇప్పిస్తానని లోబరచుకున్నారంటూ పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో శ్రీరెడ్ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు క్యూ కట్టేవారు. శ్రీరెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి గంటల తరబడి డిస్కషన్స్ నడిపించాయి ఛానెళ్లు. ఇతర భాషల హీరోయిన్స్‌ని తెలుగు సినిమాలలో తీసుకోవడానికి వీళ్లేదని చెప్పి శ్రీరెడ్డి బాగానే పోరాడింది. సినీ ప్రముఖులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా ఆమె వదల్లేదు. అప్పట్లో శ్రీరెడ్డి పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి.
కానీ కాలం గడిచేకొద్దీ శ్రీరెడ్డిని జనం మరిచిపోయారు. ఆమె మాత్రం సోషల్ మీడియాలో పలు వీడియోలు వదులుతూనే ఉంది. అయినా ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. చివరికి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో పల్లెటూరి స్టైల్లో వేష భాషలు మార్చి వంటల వీడియోలు పెట్టేది. దీనిని జనం బాగానే ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టింది శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో వ్యక్తులను టార్గెట్ చేయడం పక్కనబెట్టి.. కృష్ణా, రామ అంటూ భగవంతుడి సేవలో తరించింది.

ఈ క్రమంలో ఓ శివరాత్రి రోజున లేడీ అఘోరాగా మారిపోయిన శ్రీరెడ్డి వీడియోలు వైరల్ అయ్యాయి. ఒళ్లంతా బూడిద పూసుకుని, ఓ చేతిలో ఢమరుకం, మరో చేతిలో ఊతకర్ర పట్టుకుని నాట్యం చేసింది. తాను వివాదాలకు దూరంగా ఉంటున్నానని చెబుతూనే నటి కరాటే కళ్యాణిపై విరుచుకుపడింది. ఏ గొడవ జోలికి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాను చెన్నైలో ఉంటూ .. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని అందులో వంట వీడియోలు చేసుకుంటున్నానని.. తనను కెలకొద్దని వార్నింగ్ ఇచ్చింది.
ఇదిలావుండగా.. రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మద్ధతుగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ఉండేది. సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసింది. ఏపీ ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన తర్వాత ఆయన గొప్పదనం గురించి చాలా మాట్లాడింది. అడవుల పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని పొందినట్లు జగన్ కూడా రాజకీయాలను చాకచక్యంగా కొనసాగిస్తారని ఆయన వెంట సైన్యంలా మేమంతా ఉంటామని చెప్పింది. పేదోడు, పెద్దోడు కలిసి జగన్‌ను మోసం చేశారని ఓడిపోయినందుకు బాధపడవద్దని.. క్యాడర్‌కి కొత్త ఊపిరి పోయాలని ఆమె కోరారు.
అయితే ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు నాటి శ్రీరెడ్డి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. '' జగనన్న.. జగనన్న ఒక్కడిని కూడా వదలొద్దన్నా, వదలొద్దన్నా.. తొందరగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే ఈసారి జూన్ 12న నా బర్త్ డే మామూలుగా చేసుకోను. జీవితంలో మరిచిపోలేని పుట్టినరోజు చేసుకుంటాను, మీ పరిస్ధితి తలచుకుంటుంటే ఉందిరా నాకు , మామూలు కాన్ఫిడెంట్‌గా లేదేహే. నన్ను అన్నారు కదా.. నన్ను అన్నారని, వీళ్లని అన్నారని గాదు కానీ వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసిన వాళ్లందరికీ , అది ఏ వ్యవస్ధలో ఉన్నా కూడా , వాళ్ల పరిస్ధితి తలచుకుంటుంటే '' అంటూ శ్రీరెడ్డి ముగించారు. దీనిపై యాంటీ వైసీపీ బ్యాచ్ , నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ పుట్టినరోజు జరుపుకున్నావా లేదా, జీవితంలో మరిచిపోని విధంగా చేసుకున్నావా .. జగనన్న నీ పరిస్ధితి ఏంటన్న అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











