పాలిటిక్స్..సినిమాల్లో విజయశాంతి రీ ఎంట్రీ.. రాములమ్మ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ఇప్పుడు దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీ లలో కూడా చాలా మంది స్టార్ హీరోస్ తో పాటుగా కొందరు స్టార్ హీరోయిన్స్ కి కూడా మంచి పాత్రలతో కూడిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి. వీటిని మనం కూడా చూస్తూనే ఉన్నాము. కాగా ఒక మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే సినిమాలో మహిళా ఆర్టిస్టులకి సరైన గుర్తింపు ఉండటం లేదు అని చాలా మందే హీరోయిన్స్ అంటూ ఉంటారు.

అంతే కాకుండా ఎక్కువగా మన సౌత్ సినిమాపైనే చాలా మంది కంప్లైట్ చేశారు. అయితే ఇప్పుడు నుంచి కొంచెం వెనక్కి వెళితే ఇదే సౌత్ సినిమా దగ్గర లేడీ సూపర్ స్టార్ టాగ్ సొంతం చేసుకున్న ఏకైక పవర్ ఫుల్ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది విజయశాంతి అనే చెప్పుకోవాలి. అప్పటికే ఫైట్ లు ఏక్షన్ సినిమాలు అంటే హీరోలే చేయాలి అనే మూమెంట్ లో అవన్నీ చేస్తూ ఓ పక్క హీరోయిన్ గా కూడా దంచికొట్టిన హీరోయిన్ విజయశాంతి.

After gap actress vijayashanthi portraying this role again in her career

ఒక పెర్ఫామర్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్నో ఆమె చేశారు. మెయిన్ గా పోలీస్ పాత్రల్లో అయితే విజయశాంతి హీరోలకి ధీటుగా చేసిన పోరాట సన్నివేశాలు అవన్నీ ఇంకో ఎత్తు అని చెప్పాలి. అయితే ఇవన్నీ అప్పుడు యుక్త వయసులో ఉన్నపుడు చేశారు. తర్వాత కాల క్రమేణా గ్యాప్ వచ్చింది. సినిమాల్లో కనిపించలేదు. మళ్ళీ ఫైనల్ గా సూపర్ స్టార్ మహేష్ తో "సరిలేరు నీకెవ్వరు" లో పవర్ఫుల్ రోల్ తో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు.

కాగా మళ్ళీ ఈ సినిమా నుంచి మరో సినిమా చేయడానికి సమయం తీసుకున్నారు. అయితే ఈసారి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తన 21వ సినిమాలో లేడీ సూపర్ స్టార్ మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు అని చెప్పాల్సిందే. ఇటీవల ఆమె పుట్టినరోజు కానుకగా వదిలిన గ్లింప్స్ లో విజయశాంతి అదే ఫైర్ లో కనిపిస్తున్నారు.

దీనితో మళ్ళీ వింటేజ్ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పాలి. కాకపోతే సినిమాలో ఇప్పుడు తనకి ఈ రోల్ పూర్తి స్థాయిలో ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఇందులో ఆమె వైజయంతి ఐపీఎస్ గా కనిపించబోతున్నారు. మరి మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత తన ట్రాక్ లోకి వచ్చిన విజయశాంతికి ఈ స్పెషల్ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.

After gap actress vijayashanthi portraying this role again in her career

కాగా ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా కళ్యాణ్ రామ్ సరసన, "మేజర్" బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మాణం వహించబడుతుంది. ఈ సినిమాకి కన్నడ సెన్సేషన్ "కాంతారా" సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, సినిమాలు అడపదడపా చేసినట్టుగానే రాజకీయాల్లోను పార్ట్‌టైమ్ పొలిటిషియన్‌గా కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఏ పార్టీలో ఉన్నారో ఓటర్లకు తెలియని కన్‌ఫ్యూజన్. అలాంటి పరిస్థితిలో తన ఉనికి చాటుకొనేందుకు సినిమాలు, రాజకీయాలను ఒకేసారి తన పూర్వవైభవాన్ని తెచ్చుకొనేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X