మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ వివాదం.. అల్లు అరవింద్ డామేజ్ కంట్రోల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. బాక్సాఫీస్ పరంగా చాలానే మెగా కుటుంబపు హీరోలు కంట్రిబ్యూట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు స్కేల్ మారడంతో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి మార్కెట్ ని వీరు సొంతం చేసుకున్నారు.

కాకపోతే వీరి అందరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ పాన్ ఇండియా లెవెల్లో ఉందని తెలిసిందే. అయితే కొన్ని పాయింట్స్ వరకు బన్నీ ఓకే కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అల్లు అర్జున్ చర్యలు కొంచెం వింతగా ఉంటాయని కొందరు అంటారు. ఒకానొక టైం లో మెగా హీరోస్ విషయంలో చేసిన కాంట్రవర్సీలు ఆ తర్వాత మళ్ళీ కలిసిపోవడం తరచూగానే తరచుగానే జరుగుతూ వచ్చాయి.

Allu aravind comins to settle all things done by allu arjun immature moves

కానీ ఈసారి మాత్రం తాను చేసిన పనిని మెగా అభిమానులు తీసుకోలేకపోయారు. దీనితో అల్లు అర్జున్ కెరీర్ కి కూడా తెలుగు రాష్ట్రాల్లో డ్యామేజీ జరగొచ్చు అనే రీతిలో పరిణామాలు మారిపోయాయి. అసలు ఇదంతా ఏ ఇష్యూ కోసమో అనేది చాలామందికి క్లారిటీ వచ్చి ఉండొచ్చు. యెస్ ఇది అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీనే.. ఇంట్లో వాళ్ళని కాదని స్నేహితుడు ఇతర పార్టీ వ్యక్తి దగ్గరకి వెళ్లి ప్రచారం చేయడం పెను దుమారమే రేపింది.

దీనితో అల్లు అర్జున్ పై చాలా నెగిటివ్ వచ్చింది. దీనితో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ వేరయ్యాడు అనేది కూడా వినిపించింది. దీనికి తోడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో తిరస్కరించడం కూడా వైరల్ గా మారగా వీటి అన్నిటికి ఇప్పుడు అల్లు అర్జున్ తండ్రి టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ బలైనట్టు తెలుస్తుంది.

Allu aravind comins to settle all things done by allu arjun immature moves

బన్నీ చేసిన డ్యామేజ్ మరింత ఎక్కువ కాకుండా వెంటనే పవన్ ని కలిసి అల్లు, మెగా విడిపోలేదు అనే విధంగా ప్రొజెక్ట్ చేసే పనిలో పడ్డారని కొందరు అంటున్నారు. అంతే కాకుండా నిన్న మీటింగ్ లో కూడా పవన్ తో అల్లు అర్జున్ కాంట్రవర్సీ కోసం కూడా చర్చించారనీ కొన్ని గుసగుసలు ఉన్నాయి. వీటితో అయితే అల్లు అర్జున్ చేసిన పని మెగా, అల్లు అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. అయితే అది పెద్దది కాక ముందే కంట్రోల్ చేసే భాద్యత మాత్రం అల్లు అరవింద్ పైనే పడింది అని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్క అల్లు అర్జున్ తన భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం "పుష్ప 2" ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అలాగే రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా అనసూయ, సునీల్ ఫహద్ ఫాజిల్ లు నెగిటివ్ పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తుండగా ఈ డిసెంబర్ 6న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X