అల్లు అర్జున్ నీవు పుడింగివా? జాగ్రత్త.. జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మెగా వర్సెస్ అల్లు కాంట్రవర్సీ మళ్ళీ తాజాగా అన్నట్టుగా మారింది. గత జూన్ నెలలో టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహితుడు శిల్ప రవి అనే అతను తాలూకా ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అక్కడ నుంచి అసలు యుద్ధం స్టార్ట్ అయ్యింది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో కానీ బయట కానీ కలిసి ఉండే మెగా అభిమానులు ఈ ఇన్సిడెంట్ తర్వాత అల్లు వర్సెస్ మెగా గా మారిపోయింది. కాగా ఇక్కడ నుంచి రచ్చ మరింత ఎక్కువ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే ప్రతి రోజు కూడా అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో వార్స్ చేస్తూనే వస్తున్నారు. అయితే మధ్యలో కొంచెం సెటిల్ అయ్యింది అనే చాలా మంది అనుకున్నారు.

అంతా సాఫీగానే ఉంది అనుకునే సమయంలో మళ్ళీ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి తెర లేపాయి. నా ఫ్రెండ్స్ కోసం ఎక్కడివరకు అయినా వెళ్తాను నా ఇష్టం అంటూ కామెంట్స్ చేసిన అల్ల్లు అర్జున్ మళ్ళీ మొత్తం మొదటికే తీసుకొచ్చాడు. దీనితో సోషల్ మీడియాలో ప్రతి రోజు అంతకంతకు ఎక్కువ అవుతూ వస్తుంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కి చెందిన ప్రముఖ డైనమిక్ లీడర్ బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కోసం తన చర్యల కోసం బొలిశెట్టి తీవ్ర కామెంట్స్ చేశారు. అసలు అల్లు అర్జున్ కి అభిమానులే లేరని అంతా మెగా అభిమానులే అంటూ వ్యాఖ్యానించారు. అంతా చిరంజీవి గారి వల్ల వచ్చినవారే అల్లు అర్జున్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలీదని షాకింగ్ కామెంట్స్ చేసారు.

అతను ఊహించుకున్నాడేమో ఫ్యాన్స్ ఉన్నారని అతని స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలని షాకింగ్ కామెంట్స్ చేసారు. అని చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లా కాకుండా నేను పెద్ద పుడింగిని అనుకుని నాకిష్టమైతే వస్తా లేదంటే లేదు అంటే రావద్దు నిన్నెవరు రమ్మని అడగలేదు అని నువ్వు రాకుండానే 21 కి 21 ఎమ్మెల్యేలు కొట్టామని నువ్ సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచాడా అంటూ ఊహించని రేంజ్ లో విరుచుకు పడ్డారు.
దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మతి డి మాత్రం ఇపుడు చిన్న విషయం అయితే అయ్యేలా లేదని చెప్పాలి. డైరెక్ట్ గా పవన్ ఎమ్మెల్యేనే ఇన్ని మాటలు అంటే చాలా మంది పవన్ నుంచి కూడా రెస్పాన్స్ ని కోరుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకో పక్క మళ్ళీ అల్లు అర్జున్ కూడా ఎమన్నా కామెంట్స్ చేస్తాడా అనేది ప్రశ్నగా మారింది. మరి చూడాలి ఈ కాంట్రవర్సీ ఎక్కడ ఆగుతుందో అనేది.


Click it and Unblock the Notifications











