‘యాంకర్ శ్యామలపై మర్డర్ కేసు పెట్టాలి.. బెట్టింగ్‌తో యువకులకు ప్రాణ నష్టం’
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తూ అడ్డంగా బుక్కైన వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామలపై తెలంగాణ పోలీసు విభాగం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ ప్రమోష్స్ చేస్తున్న సినీ తారలు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఉన్న యాంకర్ శ్యామలపై జనసేన నేతలు తీవ్రంగా స్పందించారు. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్లర్లపై కేసు నమోదు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు సుమారుగా 11 మంది యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. కేసులు నమోదు చేసిన వారిలో బిగ్ బాస్ సెలబ్రిటీ విష్ణు ప్రియ, సురేఖవాణి కూతురు సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి, రీతు చౌదరి, సన్నీ యాదవ్,టేస్టీ తేజ, యాంకర్ శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

యాంకర్ శ్యామల అరెస్ట్‌పై జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమెను టార్గెట్‌గా చేస్తూ జనసేన పార్టీకి చెందిన కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. వెనుక జగన్ బొమ్మ పెట్టుకొని మాట్లాడే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై తెలంగాణలో కేసు నమోదైంది. అది ఎట్లాంటి కేసంటే? యువకులను టార్గెట్ చేసి.. వారి జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం దారుణంగా మారింది అని ఆయన అన్నారు.
యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్‌లకు అధికార ప్రతినిధా? లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధా? అని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో దూరి.. వారిని నరికేయాలి.. వాళ్ల తాట తీయాలి? వారి తొక్కి పడేయాలనే ఈమె గురించి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏం చెబుతుందో చూడాలి అని ఆయన అన్నారు. ఎందుకంటే.. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం నేరం అనే విషయాన్ని కిరణ్ రాయల్ పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసి తెలంగాణలో కేసు నమోదు చేయించుకొన్న యాంకర్ శ్యామలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత ఆమెకు లేదు. ఏదైతే బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బు సంపాదించిన విషయంపై దృష్టి పట్టాలి. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మర్డర్ కేసు పెట్టాలి. చాలా మంది ఈ వ్యవహారంలో చనిపోయారనే విషయాన్ని కిరణ్ రాయల్ ఈ సందర్భంగా తెలిపారు.
బెట్టింగ్ రాణి @YSRCParty అధికార ప్రతినిధి @AnchorShyamala కి @KiranRoyaljsp కౌంటర్ 💥
— Kiran royal (@KiranRoyaljsp) March 18, 2025
ఏపీ లో కూడా శ్యామల మీద కేసు నమోదు చేయాలి
వైసీపీ అధికార ప్రతినిధి గా సస్పెండ్ చేయాలి...@JanaSenaParty @JSPShatagniTeam @NagaBabuOffl @PawanKalyan @TirupatiPKFC @mnadendla #jansenaparty… pic.twitter.com/Z1tPcwYNMC
బెట్టింగ్ యాప్స్ వల్ల ఏపీలో కూడా చాలా మంది చనిపోయారు. ఈమె చేసిన ప్రమోషన్స్ వల్ల చాలా మంది నష్టపోవడం, చనిపోవడం జరిగి ఉంటుంది కాబట్టి.. యాంకర్ శ్యామలపై ఏపీ పోలీసులు కూడా కేసు నమోదు చేయాలి. ఆమెను స్పూర్తిగా పొంది చాలా మంది నష్టపోయారు. ఆ విషయాన్ని ఏపీ పోలీసులు దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











