పవన్ కల్యాణ్.. నీతులు చెప్పడమేనా? ప్రాణాలు బలి ఇస్తున్నారా? యాంకర్ శ్యామల ఫైర్

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టెలివిజన్ యాంకర్, వైసీపీ నేత యాంకర్ శ్యామల విరుచుకు పడ్డారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తున్న ఇద్దరు యువకులు కాకినాడ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనలో మరణించిన ఇద్దరి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. యాంకర్ శ్యామల ట్వీట్ చేసి ఎలాంటి కామెంట్స్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ శుక్రవారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు భారీగా అభిమానులు తరలివచ్చారు.

Anchor Shyamala hits out Andhra Pradesh Deputy CM Pawan Kalyan over Game Changer Pre Release Event

అయితే ఈ వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకొన్నది. అభిమానులు జాగ్రత్తలు పాటించాలి. ఇంటి వద్ద తల్లిదండ్రులు వేచి చూస్తుంటారు. కాబట్టి క్షేమంగా ఇంటికి వెళ్లండి. వారికి ఎలాంటి ఇబ్బందులు తీసుకు రావొద్దని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఈవెంట్‌కు వెళ్లి వచ్చిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు.

యువకుల మరణానికి సంఘటన వైసీపీ నేత యాంకర్ శ్యామల ఘాటుగా స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీతులు చెప్పడం వరకే. ఆచరణలో ఉండవు. అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గేమ్ ఛేంజ‌ర్ మెగా ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతే ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేస్తూ ఆ నెపాన్ని గ‌త ప్ర‌భుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు అని విమర్శించారు.

anchor shyamala pawan kalyan

కాకినాడ‌-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌ధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్ర‌మైంద‌ని మీకు ముందుగానే తెలిసిన‌ప్పుడు ఈవెంట్‌కి మీరు ప‌ర్మిష‌న్ ఎందుకు ఇచ్చారు స‌ర్. SEIZE THE ROAD అనాలి క‌దా?. సినిమాల‌కు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈల‌లు వేసి గోల చెయ్యండి అంటూ యువ‌త‌ను రెచ్చ‌గొడుతూ మీరు మాట్లాడారు.

ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మీరు అలాంటి మాట‌లు మాట్లాడాల్సిన మాట‌లేనా మీ కార‌ణంగా ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోతో క‌నీసం వెళ్లి ప‌రామ‌ర్శించారా? అంటే మీ స్వార్థానికి అమాయ‌కుల ప్రాణాలు బ‌లి ఇస్తున్నారా అని యాంకర్ శ్యామల ఆరోపించారు. ఇదిలా ఉండగా, యాంకర్ శ్యామల ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌ను, టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వరుస మీటింగులు, ట్వీట్‌లో పోస్టులు పెట్టడం జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X