తొక్కిపట్టి నార తీయరా? పవన్ కల్యాణ్ ను ప్రశ్నించిన యాంకర్ శ్యామల
యాంకర్, వైసీపీ నాయకురాలు శ్యామల మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజెంటర్ గా, యాంకర్ గా, నటిగా ఆడియెన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పొలిటికల్ గానూ ఆమె పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది. పలు విషయాలపై ముఖ్యంగా వైసీపీ తరుపున ఆమె గొంతును వినిపిస్తూ ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్యామల వాయిస్ ను ఎలా వినిపించిందో తెలిసిందే. ఇక వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఆ పార్టీ పక్షానే నిలిచి ఉంది. దీంతో ఏపీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వినిపిస్తూనే వస్తోంది. పలు సార్లు శ్యామల ట్రోలింగ్ కు కూడా గురైంది. ఏదేమైనా ధైర్యంగా తన గొంతును వినిపిస్తోంది.
ఇక తాజాగా.. యాంకర్ శ్యామాల పవన్ కళ్యాణ్ కు పలు ప్రశ్నలు సంధించింది. పవర్ స్టార్ ను ఇమిటేట్ చేస్తూ మరీ జనసేనుడిని ప్రశ్నించింది... ఇటీవల ఏపీ రాజకీయాల్లో కిరణ్ రాయల్ పేరు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారాయన. జనసేన పార్టీ తరుపున తన వాయిస్ వినిపిస్తూనే వస్తున్నారు. పలు అంశాలపై ఆయన అభిప్రాయాలను వెల్లడిస్తూనే.. ప్రత్యర్థి పార్టీలకు గట్టి కౌంటర్లు కూడా ఇస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇఫ్పుడు ఆయన లక్షీ అనే మహిళ నుంచి డబ్బు ఎగవేత ఆరోపణను ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అతన్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టిన విషయం తెలిసిందే.

యాంకర్ శ్యామల కిరణ్ రాయల్ కాంట్రవర్సీపైనే తాజాగా స్పందించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సూటిగా పలు ప్రశ్నలు అడిగింది... ఒక మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తికి జనసేన అధినేత సపోర్ట్ గా ఉన్నారంటూ ఆరోపించింది. మహిళ నుంచి డబ్బులు, బంగారం తీసుకొని... కొట్టి, తిట్టి, ఇబ్బంది పెట్టినా కూడా కిరణ్ రాయల్ ను కేవలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టామని నోట్ రిలీజ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతున్నట్టు 'తొక్కి పెట్టి నార తీస్తా?'రా అని ప్రశ్నించారు. మహిళకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని కోరారు.
అలాగే కూటమి ప్రభుత్వం మహిళలకు ఎక్కడా అన్యాయం జరగకుండా చూడాలని, ఆ దిశగా పనిచేయాలన్నారు. ఇక కిరణ్ రాయల్.. లక్ష్మి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. లక్ష్మి నుంచి కిరణ్ రాయల్ డబ్బులు తీసుకున్నారని.. తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. కిరణ్ రాయల్ ఇవ్వకపోగా ఇబ్బంది పెడుతున్నాడని లక్ష్మి వరుసగా వీడియోలు వదులుతూనే ఉంది. దీనిపై కిరణ్ రాయల్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. లక్ష్మి ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











