చిన్నారిపై ప్రేమను కురిపించిన పవన్ కల్యాణ్.. కాన్వాయ్ ఆపి డిప్యూటీ సీఎం ఏం చేశారో తెలుసా?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజల మనస్సును ఆకర్షించడంలో రాజకీయ నేతగా తన మార్కు చూపిస్తున్నాడు. సినీ నటుడిగా ప్రజలకు దూరంగా ఉంటూ కనిపించిన ఆయన.. మంత్రిగా మారిన తర్వాత జనంతో మమేకం అవుతూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఓ చిన్నారిపై కురిపించిన ప్రేమతో జనసేనాని ప్రజల మనసులను కట్టిపడేశారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే..

మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ తన శాఖల పనితీరును, వాటిలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసి బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వెల్లడిస్తున్నారు. ప్రజా ధనాన్ని ఎలా లూటీ చేశారనే విషయాన్ని స్పష్టంగా విశదీకరిస్తున్నారు.

Andhra Deputy CM Pawan Kalyan showers love affection on Small Baby

ఇక పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉప్పాడ ప్రాంతంలో జాలర్లు, సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా భారీగా ఆయనకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.

Andhra Deputy CM Pawan Kalyan showers love affection on Small Baby

ఇదిలా ఉండగా పిఠాపురం వెళ్తుండగా.. దారిలో ఓ చిన్నారి జనసేన, పవన్ కల్యాణ్ బొమ్మ ఉన్న జెండాను ఊపుతు ఐదేళ్ల బాలుడు కనిపించాడు. ఆ చిన్నారిని చూసి వెంటనే కాన్వాయ్ ఆపి కారులో నుంచి దిగి చిన్నారిని ముద్దు చేశాడు. ఆ బాబును పట్టుకొని ప్రేమ కురిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నది.

Andhra Deputy CM Pawan Kalyan showers love affection on Small Baby

ఇదిలా ఉండగా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్‌ను గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేశారు. ఇక బుధవారం సాయంత్రం పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో వరాహి వాహనంపై నుంచి ప్రసంగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X