Pawan Kalyan Exclusive Interview: ప్రకాశ్ రాజ్ సెక్యులరిస్టా? హిందువులపై దాడి ఖండించరా? నిప్పులు చెరిగిన పవన్
కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధిలోని మహా ప్రసాదం తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వును కలిపి రానే విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నది. అత్యంత వివాదాస్పదమైన అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకొంటున్నది. జనసేన అధినేత డిమాండ్ చేస్తున్న అంశాలు అందర్నీ ఆలోచింప జేసే విధంగా మారింది. ఇలాంటి సమయంలో ఎన్నో ప్రశ్నలకు వన్ ఇండియా సమాధానాలను రాబట్టింది. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూపై మీరే లుక్కేయండి.
తిరుపతి లడ్డూకు అపచారం జరిగిన తీరుపై పవన్ కల్యాణ్ సందిస్తూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం.ప్రభుత్వ పరిధిలో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకొంటామనే విధంగా పవన్ కల్యాణ్ ఘాటుగా ట్విట్టర్‌లో స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేసింది.

అయితే పవన్ ట్వీట్‌పై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. నీవు ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంవి నివు. అధికారం నీ చేతిలో ఉంది. ఆ విషయంపై మీరు దృష్టి పెట్టండి. కానీ ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా సమస్యను చేయకండి. ఇప్పటికే దేశంలో ఎన్నో మతపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ విషయాన్ని మరో అంశంగా మార్చకండి అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
అయితే ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై స్పందిస్తూ.. నాపై ప్రకాశ్ రాజ్ ఏవో కామెంట్స్ చేశారట. ఆయన అంటే నాకు గౌరవం. కానీ ఈ విషయంలో ఆయన ఎందుకు తలదూర్చుతున్నారో అర్ధం కాదు అని అన్నారు.దాంతో నేను చెప్పిందేమిటి? ఆయన స్పందిస్తున్న తీరు ఏమిటి? నేను విదేశాల్లో ఉన్నాను. 30 తర్వాత వచ్చి నీకు సమాధానం చెబుతాను అని ప్రకాశ్ రాజ్ బదులిచ్చారు.
అయితే ప్రకాశ్ రాజ్ వివాదంపై తాజా ఇంటర్య్యూలో స్పందిస్తూ.. కాష్ రాజ్ అంటే నాకు ఎంతో ఇష్టం. మా మధ్య అభిప్రాయ బేధాలు ఉండచ్చు కానీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. తిరుపతి లడ్డూ అంశంపై ఆయన అనవసరంగా మాట్లాడారు. ఆయన తనకు తాను గొప్ప సెక్యులర్ అని అనుకొంటాడు. దేశాన్ని తానే కాపాడుతారని ఫీల్ అవుతాడు అని పవన్ కల్యాణ్ సెటైర్ అన్నారు.
ప్రకాశ్ రాజ్ లౌకిక వాది అయితే.. ఎన్నడైనా బంగ్లాదేశ్, ఇతర దేశాల్లో హిందువులపై జరిగిన దాడి గురించి మాట్లాడావా? సెక్యులరిస్టులుగా ముద్ర వేసుకొనే ప్రకాశ్ రాజ్ లాంటి చాలా సులభంగా హిందూ సమాజంపై మాట్లాడేస్తారు. వేరే మతాలపై మాత్రం మాట్లాడరు అని అన్నారు. ఎవరు ఏ మతంలో ఉన్నా .. అందరూ ఒక్కటే .. ఓవ్వరు తప్పు చేసిన మాట్లాడండి అని పవన్ కల్యాణ్ చురకలు అంటించారు.
భీమవరం గుడిలో బ్రాహ్మణుడు వేసుకున్న ఒక జంధ్యాన్ని మరొక హిందూ లాగేసాడు . దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదే? హిందూ సనాతన ధర్మం ప్రకాష్ రాజ్ లాంటి వారికీ ఈజీ టార్గెట్ అని ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











