వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం.. నా కూతురిది హత్యే.. పవన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలు, పర్యవరణం, మహిళల భద్రతపై ప్రధానంగా దృష్టిపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో బాధితులు సమస్యల పరిష్కారానికి కలుస్తూ తన బాధల గోడును వెల్లడించుకొంటున్నారు. తాజాగా రాయలసీమలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసు బాధితులు తాజాగా పవన్‌ను కలిసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
కర్నూలు పట్టణంలో 2017 సంవత్సరంలో చోటుచేసుకొన్న సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. రాజు నాయక్, పార్వతీదేవీ దంపతులు కుమార్తె ప్రీతి నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతుండేది. ఆగస్టు 19వ తేదీన అమ్మాయి స్కూల్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించిందని యాజమాన్యం చెప్పింది. అయితే తన కూతురుపై యజమాని కొడుకులు బలవంతంగా అత్యాచారం చేసి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు.

అయితే గత ప్రభుత్వం హయాంలో ప్రీతి అనుమానాస్పద మరణంపై పవన్ కల్యాణ్ ఉద్యమించారు. బాధితులకు సత్వర న్యాయం చేయడమే కాకుండా ఆమె మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి మరణంపై వాస్తవాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అయితే వైసీపీ ప్రభుత్వం ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే ప్రభుత్వం దర్యాప్తుకు జీవో జారీ చేశారు. అయితే ఈ కేసులో విచారణ ముందుకు సాగలేదనే విషయాన్ని పవన్ కల్యాణ్‌కు నివేదించారు. తమ కూతురి మరణం విషయంలో తమకు న్యాయం చేయాలని ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి వినతి పత్రం అందించారు.

నా కూతురు మరణం కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దాంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి గారు పోరాడుతూనే ఉన్నారనీ, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
అయితే సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పవన్ కల్యాణ్ కలిసిన సమయంలో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. సుగాలి ప్రీతి చెల్లెల్ని ఒడిలో కూర్చొబెట్టుకొని ఓదార్చిన తీరు జనసేనాని మానవత్వానికి అద్దం పట్టాయనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి మరణం వెనుక నిందితులను శిక్షించాలని పవన్ కల్యాణ్‌ను నెటిజన్లు అభిమానులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











