సినిమా హాళ్లపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం.. ఈ రూల్స్ తప్పొద్దంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సినిమా హాళ్ల బంద్ ప్రకటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధి శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో సినిమా హాళ్ల బంద్, కొత్త సినిమాల విడుదల, టికెట్ రేట్ల పెంపు, ప్రభుత్వాన్ని సినిమా పెద్దలు సంప్రదించే తీరు తదితర అంశాలపై తీవ్రంగా చర్చించారు. అలాగే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు ఆదేశాలను కూడా జారీ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. థియేటర్లలో ఫుడ్, డ్రింక్స్ నాణ్యతగా ఉండాలని, ధరలపైనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు. తన సినిమా అయినా, ఇతర సినిమాలైనా టికెట్ ధరలు పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్నిసంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని తెలిపారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేవరో వెంటనే విచారణ జరిపి తెలియజేయాలని ఆదేశించారు.

హరిహర వీరమల్లుపై విషయంలో ఇలా..
తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ సినిమా థియేటర్ల బంద్ ప్రకటనలు, తమ శాఖ చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ విషయంలో ప్రభుత్వ శాఖలు పకడ్బందీగా పని చేయాలన్నారు. తన సినిమా హరిహర వీరమల్లు కు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని సూచించారు.
ఏపీలోని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ ల్లో ఇలా..
టికెట్ ధర కంటే సినిమా హాళ్లలలో ఏర్పాటు చేసిన పాప్ కార్న్ లాంటి స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలే ఎక్కువ ఉంటున్నాయని, తాగే నీళ్ల బాటిల్ ధరలు కూడా ఇష్టారీతిన ఉంటున్నాయని చర్చించారు. ఇకపై వాటి ధరల్లో, నాణ్యతలో తేడాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం ఉందని, దానిపైనా విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. తాగునీరు, పారిశుధ్యం పాటించడం వల్ల ఆడియెన్స్ సంఖ్య పెరుగుతుందని తద్వారా ఆదాయం, పన్ను శాతం పెరుగుతుందని సూచించారు. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12 ప్రేక్షకుల ముందుకు రానుంది.
జన నాయకుడిపైనా చర్యలు..
తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం, బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత చెప్పడంతో పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. రూల్స్ అతిక్రమిస్తే ఉపేక్షించేంది లేదన్నారు. బెదిరింపు ధోరణిలో నడిచే వారేవరైనా సహించేది లేదన్నారు. సినిమా వ్యాపారంలో ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు ఈ విషయం తెలియచేయాలన్నారు.


Click it and Unblock the Notifications











