Pawan Kalyan : దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ .. పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్

తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరిట ఆయన పార్టీని ప్రకటించారు. ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవండి వి సాలై గ్రామంలో టీవీకే తొలి బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, విజయ్ అభిమానులు పోటెత్తారు. దాదాపు 8 లక్షల మంది టీవీకే బహిరంగ సభకు వెల్లువెత్తినట్లుగా అంచనా.

ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేసిన విజయ్ ఆవేశపూరితంగా ప్రసంగం చేశారు. విజయ్ ఎవడికి భయపడడు, ఎవరివో పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేసే రకం కాదని పరోక్షంగా డీఎంకే, అన్నాడీఎంకేలపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 2026 ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి గెలిచే సత్తా టీవీకేకు ఉందని విజయ్ తెలిపారు. కుట్రలు చేయడానికి, బూతులు తిట్టుకోవడానికి తాను పార్టీ పెట్టలేదని ప్రజల ఆకాంక్ష మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు విజయ్ వెల్లడించారు.

ap deputy cm pawan kalyan tweet on kollywood star vijay joseph political entry here s the details

కెరీర్ పీక్స్‌లో ఉండగా తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను చాలా మంది సినీ నటుడు అంటూ హేళన చేస్తున్నారని ఇళయ దళపతి మండిపడ్డారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రభంజనం సృష్టించిన ఎంజీఆర్, ఎన్టీఆర్‌లు కూడా సినీ కళాకారులేనని విజయ్ స్పష్టం చేశారు. ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని.. ప్రజల కోసం సినీ కెరీర్‌నే వదిలేసుకున్నారని ఇళయ దళపతి గుర్తుచేశారు.

రాజకీయాలు పాపము లాంటివని, తనతో సహా పార్టీలో అందరూ సమానమేనని.. అందరికీ గుర్తింపు, గౌరవం లభిస్తుందని విజయ్ పేర్కొన్నారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను టీవీకే అనుసరిస్తుందని.. వాటి ఆధారంగానే తన పార్టీ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో పరాజయం పాలైన, ప్రభంజనం సృష్టించిన వారి స్టోరీలు చదివాక మీపై నమ్మకంతో మీ ముందు నిలబడ్డానని విజయ్ అన్నారు.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయనకు తోటీ నటీనటులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ఎందరో సాధువులు, సిద్ధులు పుట్టిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కి అభినందనలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

పవన్ సైతం సినీరంగం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీని స్థాపించారు. పదేళ్ల పాటు ఎన్నో ప్రజా పోరాటాలు చేసి 2024 ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించి డిప్యూటీ సీఎంగా పగ్గాలు అందుకున్నారు. తద్వారా సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాల్లోనూ సక్సెస్ కొట్టిన రికార్డు సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. మరో రెండేళ్లలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ ఏ మేరకు అంచనాలను అందుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X